Advertisement
Google Ads BL

త్రివిక్రమ్, ఎన్టీఆర్ మూవీ క్రేజ్ ఇలా ఉంది మరి!


‘అల వైకుంఠపురములో..’ సినిమాతో త్రివిక్రమ్ రేంజ్ బాగా మారిపోయింది. అజ్ఞాతవాసి అట్టర్ ప్లాప్, అరవింద సమేత యావరేజ్ అయినా.. అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్‌తో త్రివిక్రమ్ రేంజ్ ఎల్లలు తాకింది. త్రివిక్రమ్ సినిమాలంటే ఎప్పుడూ ఉన్న క్రేజ్ వేరు, ‘అల వైకుంఠపురములో..’ హిట్ తర్వాత ఉన్న క్రేజ్ వేరు. త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో..’ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా మొదలెట్టాడు. త్వరలోనే త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కుతోంది. ఇక ఎన్టీఆర్ RRR‌తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. దానితో ఎన్టీఆర్ క్రేజ్ డబుల్ అయ్యింది. ఇప్పటికే ఎన్టీఆర్ సినిమాలంటే వెర్రెక్కిపోయే ప్రేక్షకులకు పాన్ ఇండియా హీరో అయ్యాక మరేలా ఉంటారో చూడాలి.

Advertisement
CJ Advs

అయితే ప్రస్తుతం ‘అల వైకుంఠపురములో..’కి త్రివిక్రమ్ పారితోషకం 15 కోట్లుగా ఉంటే.. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకి హారికా హాసిని, కళ్యాణ్ రామ్ నుండి త్రివిక్రమ్ 20 కోట్లు పారితోషికం అందుకోబోతుంటే.. ఎన్టీఆర్ ఏకంగా 40 కోట్లు.. ప్లస్ కళ్యాణ్ రామ్ వాటాలో షేర్ అందుకోబోతున్నాడట. సినిమా బడ్జెట్ లో సగానికిపైగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ లే పట్టుకెళ్ళిపోతారంటున్నారు. ఇద్దరు కలిపి 60 కోట్లు అంటే.. మిగతా బడ్జెట్ ఎంత పెట్టాలో నిర్మాతలే ఆలోచించాలి. ఎన్టీఆర్ కి 40 కోట్లు అని మాట్లాడినా.... కళ్యాణ్ రామ్ వాటాలో షేర్ తో కలిపి ఎన్టీఆర్ కి దండిగానే ముడుతుంది అంటున్నారు. మరి భారీ బడ్జెట్ అంటున్నారు.. ఆ బడ్జెట్ లో సగం హీరో, దర్శకుడికే తెగితే.. మూవీ బడ్జెట్ ఎంత పెట్టాలి.. ఖర్చులు తగ్గించాలా, లేదంటే క్రేజ్ ఉంది కదా.. ఎడా పెడా పెట్టినా పర్లేదులే అనుకోవాలా.. ఏది ఏమైనా. త్రివిక్రమ్, ఎన్టీఆర్ రేంజ్ ముందు ఈ పారితోషకాలు ఎంత అనేలా నిర్మాతలు ఈ సినిమాకు ఖర్చు పెట్టబోతున్నారని మాత్రం తెలుస్తుంది.

This is the Jr NTR and Trivikram Movie Craze :

Remuneration: 40 for Jr NTR and 20 for Trivikram Srinivas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs