పవన్ కళ్యాణ్ రెండేళ్లుగా ఫ్యాన్స్‌కి కనబడక పిచ్చెక్కిపోయి ఉన్నారు. ఎప్పుడు ప్రజలు, ఫ్యాన్స్ మధ్యలోనే ఉంటున్నాడుగా పవన్ కళ్యాణ్ రెండేళ్లు కనబడకపోవడమేమిటి అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ వెండితెర మీద కనబడి రెండేళ్లు పూర్తయ్యింది. ఆయన స్టయిల్, క్రేజ్ అన్ని ఫ్యాన్స్ బాగా మిస్ అవుతున్నారు. ఎప్పుడూ రొటీన్‌గా వైట్ డ్రెస్ లోనే కనబడుతున్న పవన్ కళ్యాణ్ మళ్ళి స్క్రీన్ మీద స్టైలిష్‌గా కనబడే రోజు కోసం ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయి ఎదురు చూస్తున్నారు. అందుకే పవన్ కూడా ఆ పింక్ రీమేక్ వకీల్ సాబ్ ని స్టార్ట్ చెయ్యడమే.. వరసగా సినిమాలు ఒప్పుకుంటూ ఫ్యాన్స్‌కి ఊరటనిచ్చాడు.
ఇక పింక్ రీమేక్ వకీల్ సాబ్ కూడా మే 15 అంటూ దిల్ రాజు డేట్ ఇవ్వడం, సినిమా ఫస్ట్ లో టైటిల్ తోనే హంగామా మొదలెట్టడం జరిగింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పే కోర్టు డైలాగ్స్ తో పాటుగా కోర్టు ఎపిసోడ్ హైలేట్ అంటూ వార్తలు రావడం.. లాయర్ గా పవన్ కళ్యాణ్ కాస్త స్టైలిష్ గా కనబడడంతో.. సినిమా మీద అంచనాలు అంతకంతకు పెరిగిపోయాయి. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా మే 15 నుండి జూన్ కి వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా సోషల్ మీడియా న్యూస్. ఒకవేళ వకీల్ సాబ్ సినిమా గాని జూన్ కి పోస్ట్ ఫోన్ అయితే మాత్రం.. పవన్ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కెయ్యడం ఖాయం. ఎప్పుడెప్పుడూ సినిమా చూద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి.. నిజంగానే ఈ వార్త నిరుత్సాహపరుస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.