Advertisement
Google Ads BL

నాలో చాలా మార్పు వచ్చిందంటున్న తమన్నా!


15 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా చెలామణి అయిన తమన్నా ఇప్పటికి... హీరోయిన్ పాత్రలతో గ్లామర్ ఆరబోస్తూ గట్టి పోటీ ఇస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా అందరి హీరోలతోనూ నటించిన తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ సినిమాల్తో బిజీగానే ఉంటుంది. బాహుబలి తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చింది తమన్నాకి ఆ గ్యాప్ ని తొందరగా ఫిలిప్ చేసింది. ప్రస్తుతం చేతినిండా సినిమాల్తో బిజీగా వున్న తమన్నాకి అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదట. పెళ్లి తర్వాత అవకాశాలు రావడం కష్టమని భావిస్తుంది ఈ హాట్ సుందరి. ఇప్పటికి.. మ్యాగజైన్ మెయిన్ పేజెస్ మీద సందడి చేసే తమన్నా సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఉత్సాహంగా సినిమా షూటింగ్ లకి వెళ్ళేది.

Advertisement
CJ Advs

అప్పట్లో ఉత్సాహం గా షూటింగ్ కి హాజరైతే.. ఇప్పుడు మాత్రం పరిణితితో సినిమా షూటింగ్ లకే కాదు.. కథలు వినడంలోనూ బాధ్యత పెరిగింది అంటుంది. కెరీర్ తొలినాళ్లలో టీనేజ్ అమ్మాయిలు ఎలా ఉంటారో అలా ఉత్సాహంగా ఏ అవకాశం వచ్చిన చేసెయ్యగలను అనే ఆత్మవిశ్వాసం ఉండేది అని.. కానీ ఇప్పుడు నా ఆలోచనలో ఎంతో పరిణితి కనబడుతుంది. బహుశా అది నా అనుభవంతో వచ్చిన మార్పెమో.. ప్రస్తుతం సినిమాల్లో నేను చేస్తున్న పాత్రలో అయినా, నా వ్యక్తిగతంగా అయినా ఎలాంటి తడబాటు ఉండడం లేదు అంటుంది తమన్నా. అలాగే చాలా ప్రశాంతంగా ఆలోచిస్తూ సినిమాలు ఓకె చేయడంతో.. అది పాత్ర మీద కూడా ప్రభావం చూపిస్తుంది అని చెబుతుంది తమ్ము బేబీ.

Big change in me says Tamanna:

Tamanna Busy with Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs