Advertisement
Google Ads BL

నో కన్ఫూజన్.. ఉగాదికి మహేశ్ కొత్త మూవీ!


‘మహర్షి’ మూవీతో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు మంచి హిట్టిచ్చిన వంశీ పైడిపల్లితో.. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో..? అసలు ఈ కాంబోలో మళ్లీ సినిమా ఉందో లేదో తెలియట్లేదు కానీ.. వార్తలు, పుకార్లు మాత్రం గట్టిగానే వస్తున్నాయ్. అంతేకాదు.. ఈ వార్తలతో ఇద్దరి మధ్య మనస్పర్థలు కూడా వచ్చాయని కొన్ని రోజులు.. ‘మహేశ్-వంశీ రిలేషన్ బాగానే ఉంది!’ అని మరికొన్ని రోజులు వార్తలు వినిపించాయ్. అయితే తాజాగా.. మహేశ్ నెక్స్ట్ సినిమాపై కన్ఫూజన్ మొత్తం పోయిందట. ఉగాదికి వచ్చేయాలని ఫుల్ క్లారిటీతో మహేశ్ ఉన్నాడట.

Advertisement
CJ Advs

‘గీత గోవిందం’ డైరెక్టర్ పరశురామ్‌తో చేయాలని మహేశ్ ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం ఈ కథపైనే పరశురామ్ కసరత్తులు ప్రారంభించాడు. మరోవైపు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఉగాది రోజున పూజా కార్యక్రమాలతో లాంఛనంగా షూటింగ్‌ మొదలెట్టే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే వీరిద్దరి మధ్య వచ్చే సినిమా ఎలా ఉంటుంది..? మరో ‘గీత గోవిందం’ అవుతుందా..? సినిమా జోనర్ ఎలా ఉండబోతోంది..? అనే ఉత్కంఠ అభిమానుల్లో, సినీ ప్రియుల్లో నెలకొంది. కాగా.. ఈ కాంబోలో వచ్చే సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారని తెలుస్తోంది.

కాగా.. సరిలేరు తర్వాత అసలు ఏ సినిమాలో నటించాలి..? ఏ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి..? అసలు చిరు-కొరటాల మూవీలో నటించాలా వద్దా..? ఇలా మహేశ్‌లో చాలా కన్ఫూజన్సే ఉన్నాయి. వీటన్నింటికీ ఉగాదికి పరిష్కారమార్గం దొరకుందన్న మాట. మరి తాజా వార్తల్లో అయినా నిజానిజాలు ఏ మాత్రం ఉన్నాయో..? అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్న ఆ రోజు రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడక తప్పదు. మొత్తానికి చూస్తే.. మొన్న సంక్రాంతికి సంబరాలు తెచ్చిన మహేష్.. రేపు ఉగాదికి కొత్త ఉత్సాహం నింపబోతున్నారన్న మాట. 

No Confusion.. Mahesh Movie UGADi:

No Confusion.. Mahesh Movie UGADi  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs