Advertisement
Google Ads BL

ప్లాప్ డైరెక్టర్‌తో కుర్ర హీరో.. హిట్ కొడతాడట!?


మలయాళ స్టార్ హీరోల్లో ఒకరైన దుల్కర్ సల్మాన్‌కు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి మరీ పరిచయం చేయనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ‘మహానటి’ సినిమా చూసిన సినీ ప్రియులకు అయితే అస్సలు పరిచయం అక్కర్లేదు. జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ నటించి మెప్పించడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈయనకు ఫాలోయింగ్ పెరిగిపోయింది.అలా  ఆయన సొంత భాషలోనే కాకుండా తెలుగు, తమిళంలో కూడా మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే దుల్కర్, రీతూ వర్మ జంటగా నటించిన ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని ఈ కుర్ర హీరో భావిస్తున్నాడు.

Advertisement
CJ Advs

ఇప్పటికే.. ఓ ఇంటర్వ్యూలో తనను డైరెక్ట్‌గానే తెలుగులో చేయాలని కొందరు డైరెక్టర్‌లు సంప్రదించారని.. ఆఫర్లు అయితే వస్తున్నాయ్.. ఈ ఏడాది చివరిలో చేస్తానని చెప్పాడు. అయితే ఆ సమయం ఆసన్నమైందట. స్ట్రైట్ కథలో చేయాలని డైరెక్టర్ హ‌ను రాఘ‌వ‌పూడి సంప్రదించి స్టోరీ లైన్ చెప్పగా దుల్కర్ ఓకే అన్నాడట. అయితే క్లైమాక్స్ అంతగా ఆకట్టుకోదని.. మార్పులు చేర్పులు చేయాలని కుర్ర హీరో సూచించాడట. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయ్.. మరోవైపు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయ్. 

కాగా.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాలో దుల్కర్ ఓ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్రలో క‌నిపించ‌బోతున్నాడ‌ట. అయితే రాఘవపూడి ఇప్పటి వరకూ నాలుగు సినిమాలను తెరకెక్కించగా అన్నీ ఫర్లేదు అనిపించాయే తప్ప పెద్దగా బ్లాక్ బస్టర్ అవ్వలేదు. ‘అందాల రాక్షసి’ అంతంత మాత్రమే.. ‘క్రిష్ణ గాడి వీరప్రేమ గాథ’, ‘లై’, ‘ప‌డిప‌డిలేచె మ‌న‌సు’ లు కూడా పెద్దగా ఆడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇతనికి ప్లాప్ డైరెక్టర్‌గా ముద్ర పడిపోయింది. అయితే.. ప్లాప్ డైరెక్టర్‌కు అవకాశమిచ్చాడేంటి..? అనే వార్తలు పెద్ద ఎత్తున వస్తుండగా.. అందరూ ఆయనతో సినిమా చేయకపోతేనేం.. నేను చేస్తానని.. ఎందుకు హిట్ పడదో చూస్తానని తన సన్నిహితులతో దుల్కర్ అన్నాడని తెలుస్తోంది. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంది.

Young Hero With Flop Director..!:

Young Hero With Flop Director..!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs