అవును మీరు వింటున్నది నిజమే.. కుర్ర హీరో.. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ అస్సలు అవ్వట్లేదట.. దీంతో బన్నీ రంగంలోకి దిగుతున్నారట. అదేంటి విజయ్ సినిమా కోసం అల్లు అర్జున్ రంగంలోకి దిగుతున్నాడా..? అనే అనుమానం వస్తోంది కదూ.. అస్సలు కాదండోయ్.. ఇది యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్ విషయమే. ఇంతకీ ఆ యాప్ ఏంటి..? ఇందులో నిజానిజాలెంత అనేది ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇదివరకే పలు ప్రకటనల్లో చేసి మెప్పించి.. సదరు ప్రకటనలకు న్యాయం చేశాడు. వీటిలో OLX, Colgate Maxifresh, Hotstar, Frooti, Red Busతో పాటు ఇంకా చాలానే బ్రాండ్‌లకు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. అయితే ఇవన్నీ గ్రాండ్ సక్సెస్ అయ్యాయ్ కూడా. తాజాగా రౌడీ విజయ్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కలిసి ‘ఆహా’ యాప్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ యాప్‌కు ఇంతవరకూ విజయ్ దేవరకొండే బ్రాండ్ అంబాసిడర్‌గా ఒకట్రెండు వీడియోలు కూడా చేశాడు. అయితే.. ఆయన ట్రిక్స్ జనాలకు పెద్దగా ఎక్కలేదు. దీంతో విజయ్ స్థానంలో బన్నీని రంగంలోకి దింపాలని అరవింద్ భావిస్తున్నారట. అంటే విజయ్ వల్ల అవ్వట్లేదన్న మాట.
బన్నీ అయితే మెగాభిమానులకు బాగా దగ్గరైనట్లు ఉంటుందని.. తద్వారా యాప్ వినియోగించేవాళ్ల సంఖ్య కూడా బాగా పెరుగుతుందని భావిస్తున్నారట. ఆశించిన రేంజులో సక్సెస్ అవ్వకపోవడంతో బన్నీ రంగంలోకి దింపక తప్పలేదట. ఈ విషయం బన్నీ చెవిన పడేయగా ఓకే అని కూడా చెప్పాడట. అంతేకాదు.. ‘నాన్న కోసం కచ్చితంగా చేస్తాను.. నాకు ఎలాంటి పారితోషికం అక్కర్లేదు’ బన్నీవాస్‌తో అల్లు అర్జున్ చెప్పి పంపాడట. అంటే నాన్నకు ప్రేమతో ఫ్రీగానే ప్రకటన చేసి పెడుతున్నాడన్న మాట. మరి బన్నీ రంగంలోకి దిగితే అయినా ‘ఆహా’ అదిరిపోతుందో లేదో వేచి చూడాల్సిందే.