జబర్దస్త్ లో హైపర్ ఆది స్కిట్ లో కమెడియన్ గా చేసే దొరబాబు, పరదేశిలు వైజాగ్ లో వ్యభిచారం ముఠాలో పోలీసులకు పట్టుబడి మీడియాకి అడ్డంగా దొరికిపోయారనే విషయం తెలిసిందే. అయితే దొరబాబు వాళ్ళు తమ ఫ్రెండ్స్ ని కలవడానికి ఆ అపార్ట్మెంట్ కి వెళితే అక్కడ రైడింగ్ జరిగి వీళ్లిద్దరు బుక్ అయ్యారని లేదంటే దొరబాబు చాలా మంచోడనే టాక్ కూడా వినబడుతుంది. ఇక దొరబాబు భార్య కూడా తన భర్త గురించి తనకు తెలుసని ఎవరు చెప్పక్కర్లేదని తన భర్త మంచోడని అంటుంది. ఇక జబర్దస్త్ లో మళ్ళీ దొరబాబుని రానిస్తే పరువు పోతుంది అనే ఆలోచనలతో మల్లెమాల యాజమాన్యం దొరబాబుని, పరదేశిని తీసేసినట్లుగా వార్తలొచ్చాయి.
మళ్ళీ దొరబాబుని జబర్దస్త్ లో కంటిన్యూ చేస్తే షో మీద నెగిటివిటి ఏర్పడుతుందని మల్లెమాల ఆలోచనట. కానీ హైపర్ ఆది మాత్రం దొరబాబుని మళ్ళీ జబర్దస్త్ లోకి తీసుకురావాలని అనుకుంటున్నాడట. దొరబాబుని మల్లెమాల తప్పిస్తున్నట్లుగా వార్తలొస్తున్న నేపథ్యంలో ఆది మల్లెమాల యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నట్టుగా టాక్. దొరబాబుని టీంలోకి తీసుకోవాలని ఆది అడుగుతున్నాడట. ఇక హైపర్ ఆది క్రేజ్ రేంజ్ తెలిసిన మల్లెమాల కూడా దొరబాబుని చేర్చుకునేందుకు ఒప్పుకున్నట్లే కనబడుతున్నారు. కానీ కండిషన్స్ అప్లై అంటున్నారట. ఇక నుండి ఎవరైనా తప్పు చేస్తే సహించేది లేదని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇక దొరబాబు తెలిసి చేసాడో తెలియక చేసాడో ఇకపై ఎలాంటి వివాదాలకు పోనని హామి పత్రం ఇస్తే టీంలోకి తీసుకుంటామని ఆదికి మల్లెమాల యాజమాన్యం చెప్పినట్లుగా టాక్.