Advertisement
Google Ads BL

ఎట్టకేలకు ప్రారంభమైన దేవకట్ట చిత్రం!


>దేవకట్ట చిత్రం ప్రారంభం

Advertisement
CJ Advs

వెన్నెల చిత్రంతో దర్శకుడిగా ప్రారంభమైన దేవకట్ట తొలి చిత్రంతోనే క్లాసిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత శర్వానంద్ సాయికుమార్ కాంబినేషన్లో రూపొందించిన ప్రస్థానం చిత్రం సూపర్ హిట్ అవడమే కాకుండా ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ కైవసం చేసుకుంది.

నాగచైతన్య తో తీసిన ఆటోనగర్ సూర్య చిత్రం ప్లాప్ అవడం దేవకట్ట కెరీర్ కాస్త వెనకబడిందనే చెప్పాలి. మళ్ళీ చాలా కాలం గ్యాప్ తరువాత దేవకట్ట మెగాఫోన్ పట్టుకున్నారు. రీసెంట్ గా ప్రతిరోజు పండగే చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన మెగా సుప్రీం సాయిధరమ్ తేజ్ హీరోగా జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తోన్న చిత్రానికి దేవకట్ట దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ రోజు   ప్రారంభమైన ఈ చిత్రం ప్రారంభోత్సవానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరై హీరో సాయిధరమ్ తేజ్ హీరోయిన్ నివేత పేతురాజ్ లపై క్లాప్ కొట్టగా ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ ముహూర్తపు సన్నివేశానికి వంశీ పైడిపల్లి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కు స్వరబ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. శ్యామ్ దత్ ఫోటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది..!!

Beginning of Devakatta film:

<pre id="tw-target-text" class="tw-data-text tw-text-large tw-ta" dir="ltr"><span lang="en">Beginning of Devakatta film</span></pre>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs