Advertisement
Google Ads BL

బెల్లంకొండ అల్లుడు సెంటిమెంట్..


బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయమై చాలా రోజులు అవుతున్నా చెప్పుకోదగ్గ హిట్ మాత్రం కొట్టలేకపోయాడు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం అల్లుడు శీను ఫర్వాలేదనిపించినా ఆ తర్వాత వచ్చిన చిత్రాలే వీ పెద్దగా ఆకట్టృకోలేకపోయాయి. ఇక బెల్లంకొండ నుండి వచ్చిన తాజా చిత్రం రాక్షసుడు చిత్రం విజయం సాధించిందని చెప్పుకున్నప్పటికీ అదేమంత హిట్ కాదని కాకపోతే రీమేక్ చిత్రం కావడంతో జనాలని ఆకర్షించిందని విమర్శకుల అభిప్రాయం.

Advertisement
CJ Advs

అయితే నేడు బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త చిత్రం ప్రారంభమైంది. కందిరీగ ఫేమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సుమంత్ మూవీ ప్రొడక్షన్ బ్యానర్ లో గోరెల్ల సుబ్రమణ్యం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అల్లుడు అదుర్స్ అనే టైటిల్ ని ఖరారు చేశారు. నేడు ఈ చిత్ర చిత్ర ఫస్ట్ లుక్ ని రివీల్ చేసారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఒకరు నభా నటేష్ కాగా మరొకరు అనూ ఇమ్మాన్యూయేల్ నటిస్తున్నారు.

తెలుగులో అల్లుడు పేరుకి ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అందుకే ఈ టైటిల్ తో అల్లుడు శీను మరోసారి తెరమీద కనిపించబోతున్నాడు. మరి అల్లుడు సెంటిమెంట్ బెల్లంకొండకి ఏ విధంగా వర్కౌట్ అవుతుందో చూడాలి.

Bellamkonda ALludu sentiment ..:

Bellamkonda srinivas new movie titled as Alludu Adhurs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs