Advertisement
Google Ads BL

౩౦ రోజుల్లో ప్రేమించడం ఎలా..అడుగుతున్నాడా.. చెప్తున్నాడా?


బుల్లితెర మీద యాంకర్ గా చేసే ప్రదీప్ అందరికీ సుపరిచితుడే. ఇప్పటి వరకు చాలా టీవీషోలకి హోస్ట్ గా వ్యవహరించిన ప్రదీప్ అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న చితకా పాత్రల్లోనూ మెరిశాడు. అటు బుల్లితెర మీద ఇటు వెండితెర మీద బ్యాలన్స్ చేసుకుంటూ వెళ్తున్న ప్రదీప్ ప్రస్తుతం సోలో హీరోగా సినిమా చేస్తున్నాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా ద్వారా ప్రదీప్ హీరోగా పరిచయం అవుతున్నాడు.

Advertisement
CJ Advs

ఈ సినిమా మార్చ్ 25వ తేదీన విడుదలకి సిద్ధంగా ఉంది. ఇప్పటికీ టీజర్ రిలీజ్ చేయని ఈ సినిమా నుండి రెండు పాటలు విడుదల అయ్యాయి. అందులో నీలి నీలి ఆకాశం పాట ట్రెండింగ్ లోకి వెళ్ళింది. ఈ పాట ఐదు కోట్ల మందికి చేరువై ఈ సినిమాకి ఎక్కడలేని హైప్ ని తీసుకొచ్చింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా గురించి జనాల్లో చాలా సందేహాలున్నాయి. ౩౦ రోజుల్లో ప్రేమించడం ఎలా అనే టైటిలే పెద్ద కన్ఫ్యూజన్ గా తోస్తుంది.

ప్రదీప్ ముఫ్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అని మనల్ని అడుగుతున్నాడా లేదా మనకి 30 రోజుల్లో ప్రేమించడం ఎలాగో చెప్తున్నాడా అనేది అర్థం కావట్లేదు. అయితే విడుదలయిన రెండు పాటల్ని బట్టి చూస్తే ప్రదీప్ మనల్నే అడుగుతున్నట్టు అనిపిస్తుంది. మరి సినిమా చూస్తేనే కానీ తెలియదు ప్రదీప్ ఏం చేస్తున్నాడో.

Is he Asking or telling to us.?:

Pradeep is asking for how to love in 30 days or telling to us
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs