Advertisement
Google Ads BL

పవన్‌కి త్రివిక్రమ్ దూరమైనట్లేనా..?


పవన్ కళ్యాణ్‌కి సినిమాల విషయంలో ఆప్త మిత్రుడు ఎవరైనా ఉన్నారు అంటే అది త్రివిక్రమే. త్రివిక్రమ్ పవన్ స్నేహం చాలా ఏళ్లుగా కొనసాగుతుంది. రాజకీయాల్లోకి వెళ్లినా... పవన్ త్రివిక్రమ్ స్నేహం వదలలేదు. కాబట్టే త్రివిక్రమ్ చెప్పాడని పింక్ రీమేక్ విషయం అలోచించి.. ఆ సినిమాకి ఓకే చెప్పాడు. త్రివిక్రమ్ చెప్పడం వలనే పవన్ పింక్ రీమేక్ ఒప్పుకున్నాడని పవన్ ఫ్యాన్స్‌కి తెలిసి.. అదేమిటయ్యా.. నీవు అలాంటి సలహా ఇవ్వడమేమిటి.. హీరోయిజంతో రీ ఎంట్రీ ఇవ్వాలి కానీ.. ఇలా సో సో సినిమాని పవన్ కి అంటగట్టావు అంటూ త్రివిక్రమ్ పై పవన్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు కూడా. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ టచ్‌లోకి రావడం లేదనే టాక్ వినబడుతుంది. లేదంటే ఇప్పటికే త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేదని అంటున్నారు. 

Advertisement
CJ Advs

వేణు శ్రీరామ్, క్రిష్ తర్వాత ఖచ్చితంగా త్రివిక్రమ్ తో పవన్ సినిమా ఉండేదని.. కానీ త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ పై ఫోకస్ పెట్టలేదని అంటున్నారు. గతంలోనే పింక్ రీమేక్ డైలాగ్స్ విషయంలో పవన్ చెప్పినా త్రివిక్రమ్ వినలేదన్నారు. ప్రస్తుతం కూడా త్రివిక్రమ్ అల వైకుంఠపురములో హిట్ తర్వాత రామ్ చరణ్ కానీ, తారక్ తో కాని అనుకుని.. చివరికి ఎన్టీఆర్ కి ఫిక్స్ అయ్యాడు. తర్వాత కూడా అల్లు అర్జున్ లేదంటే మహేష్ లేదంటే రామ్ చరణ్. అంతేకాని పవన్ తో సినిమా విషయంలో త్రివిక్రమ్ ఎలాంటి ఆలోచనలు చెయ్యడం లేదని అంటున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం త్రివిక్రమ్ - పవన్ కాంబో పక్కా అని అంటున్నారు. అయితే ఈ విషయంలో పవన్ కూడా సైలెంట్ అయ్యి.. క్రిష్, హరీష్ సినిమాలను వరసగా లైన్‌లో పెట్టాడంటున్నారు.

No Movie Between Trivikram Srinivas and Pawan Kalyan:

Trivikram Srinivas and Pawan Kalyan.. No Chance
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs