Advertisement
Google Ads BL

హిమాలయాలకు మహేష్.. ‘కథ’ ఏంటి?


ప్రస్తుతం మహేష్ నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనలో ఉన్నాదో.. లేదో.. ఎవరికి అర్ధం కావడం లేదు. ఎందుకంటే సరిలేరు నీకెవ్వరు తర్వాత వంశీ పైడిపల్లితో కలిసి మరో మూడు నెలల్లో సినిమా అంటూ కమిట్ అయ్యాడు. అయితే అనుకోకుండా మహేష్ మధ్యలోనే వంశీ పైడిపల్లి సినిమాని ఆపేసాడు. అయితే ఆ సినిమా ఎందుకు ఆగింది అనేది ఎవరికీ తెలియదు కానీ.. మహేష్ చిరు సినిమా ఆచార్యలో ఓ గెస్ట్ రోల్ చేస్తున్నాడనే టాక్ ప్రచారంలోకొచ్చిది. అది నిజామా.. కాదా.. అనేది మహేష్ టీం నుండి క్లారిటీ రాలేదు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా మహేష్ బాబు హిమాలయాలను సందర్శించడానికి వెళుతున్నాడనే న్యూస్ ఉంది చూశారూ.. దానితో మహేష్ అభిమనులు కంగారు పడుతున్నారు. ఈ వయసులో మహేష్ హిమాలయాలకు ఎందుకు.. సినిమాలు చేసుకోక అంటూ తెగ ఇదై పోతున్నారు. ప్రస్తుతం చేతిలో సినిమాలేవీ లేవు.. ఏ దర్శకుడు మంచి కథతో మహేష్ ఇంప్రెస్ చేయలేక గడువు అడుగుతున్నారు. దానితో మహేష్ ప్రస్తుతం ఖాళీ. అందుకే ఈ గ్యాప్‌లో ఓ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాలని.... అందుకోసం మహేష్ హిమాలయాలను ఎంచుకున్నాడని టాక్. అయితే కోలీవుడ్ సీనియర్ హీరో రజినీకాంత్ ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక చింతనతో హిమాలయాలను సందర్శిస్తూ వార్తల్లో ఉన్నట్లుగా.. ఇప్పుడు మహేష్ కూడా ఇలా హిమాలయాలంటూ హాట్ టాపిక్‌కి తెరలేపాడు.

Tollywood Superstar to take a break in Himalayas?:

Mahesh All Set to Go to The Himalayas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs