Advertisement
Google Ads BL

ఇంత వెయిట్ చేసి మళ్లీ ఫ్లాప్ డైరెక్టర్ తోనేనా శిరీష్..?


మెగా హీరోలందరిలో ఇప్పటి వరకు హిట్ లేని ఒకే ఒక్క హీరో అల్లు శిరీష్. శిరీష్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి ఎన్నో రోజులు అవుతున్నా తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకోలేకపోతున్నాడు. వరుస సినిమాలు చేస్తున్నా విజయం మాత్రం అందుకోలేకపోతున్నాడు. శ్రీరస్తు శుభమస్తు హిట్ అనిపించుకున్నప్పటికీ అది డైరెక్టర్ ఖాతాలోకి పోయింది. అయితే ప్రస్తుతం అల్లు శిరీష్ ఒక సినిమాని ఓకే చేశాడట.

Advertisement
CJ Advs

ఏబీసీడీ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న శిరీష్ మొత్తానికి సినిమాని ఓకే చేశాడు. అయితే అది కూడా ఒక ఫ్లాప్ డైరెక్టర్ తో కావడం ఆశ్చర్యంగా ఉంది. చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమైన విజేత సినిమాని డైరెక్ట్ చేసిన రాకేశ్ శశి దర్శకత్వంలో శిరీష్ ఓ సినిమా చేయబోతున్నాడట. అయితే అసలే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న శిరీష్ మళ్ళీ ఫ్లాపు డైరెక్టర్ తో జతకట్టడం ఏంటని మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

ఎవరైనా పేరున్న డైరెక్టర్ తో సినిమా తీస్తే కొంచెం ప్లస్ అవుతుందని సలహా ఇస్తున్నారు. మరి రెండు ఫ్లాపులు మూటగట్టుకున్న రాకేశ్ శశితో చేసే సినిమా అయిన హిట్ అవుతుందో లేదో చూడాలి.

Sireesh movie with vijetha director..?:

Sireesh movie with Vijetha director Rakesh sasi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs