Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ ఓకే చేసేశాడు.. చరణ్ కూడా ఓకే చేసినట్టేనా..?


రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం తమ రెండు సంవత్సరాల కాలాన్ని రాజమౌళికి అప్పగించారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయ్యే వరకు ఎన్టీఆర్, రామ్ చరణ్ మరో సినిమాలో పాల్గొనడానికి లేదు. ఈ సినిమాని వచ్చే సంవత్సరం జనవరి 8 వ తేదీన విడుదల చేస్తారట. అయితే ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ తన తర్వాతి చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నానని ప్రకటించేశాడు.

Advertisement
CJ Advs

వీరిద్దరి కాంబినేషన్ లో అరవింద సమేత ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఎన్టీఆర్ తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించినప్పటి నుండి చరణ్ సినిమా ఎవరితో ఉంటుందని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తర్వాతి చిత్రం గురించి ఆన్ లైన్ లో అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఒక కొత్త దర్శకుడితో సినిమా ఒప్పుకున్నాడని అంటున్నారు. ప్రదీప్ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో సినిమా చేస్తాడని అంటున్నారు. ఈ వార్తల పట్ల అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ప్రస్తుతం ఈ వార్త హల్ చల్ చేస్తుంది.

ఇప్పటి వరకు రామ్ చరణ్ తన కెరీర్లో కొత్త దర్శకుడితో సినిమా చేసింది లేదు. మరి ఆర్ ఆర్ ఆర్ లాంటి బిగ్ మూవీ తర్వాత ఇలాంటి డెసిషన్ తీసుకోవడం రిస్కేమో ఒకసారి ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు.

NTR next is OK. Charan next will be:

Rumours spread over film circles that charan is doing a film with new director
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs