Advertisement
Google Ads BL

శర్వా శ్రీకారానికి రిపేర్లు..?


పడి పడి లేచె మనసు యావరేజ్, రణరంగం డిజాస్టర్.. జానుని హిట్ అనాలో.. డిజాస్టర్ అనాలో అర్ధమవడం లేదు. జాను సినిమా సూపర్ అందులో శర్వా నటన అదుర్స్. అయినా సినిమా ప్లాప్ అవడంతో శర్వానంద్ ఇక తన శ్రీకారం మీదే ఆశలు పెట్టుకున్నాడు. కాని శ్రీకారం సినిమా కథకి, నితిన్ భీష్మ కథకి దగ్గర పోలికలు ఉండడంతో శర్వానంద్ బాగా కంగారు పడినట్లుగా వార్తలొచ్చాయి. సేంద్రియ పద్దతులతో ఆర్గానిక్ పంటలు పండించే కుర్రాడిగా ఓ చదువుకున్న రైతుగా శర్వానంద్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న శ్రీకారం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందట.

Advertisement
CJ Advs

అయితే సినిమా రషెస్ చూసిన శర్వా కొన్ని సీన్స్ విషయంలో అసంతృప్తిగా ఉన్నాడని సినిమాలో శర్వా నటించిన ప్రేమ కథ ఎపిసోడ్  మ‌రీ డ‌ల్‌గా ఉంద‌ని అనిపించింద‌ట‌. అయితే  అలా డ‌ల్‌గా అనిపించిన సీన్స్ మళ్ళీ కొత్తగా కాస్తంత ఇంట్రెస్టింగ్ గా రాసుకుని రీ షూట్ చేస్తే ఎలా ఉంటుంద‌న్నఆలోచ‌న‌లో దర్శకుడుతో పాటుగా శర్వా ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. జాను సినిమాలో డీప్ లవ్ స్టోరీలో తన నటనా ప్రావీణ్యాని అంతా రంగరించిన శర్వాకి శ్రీకారంలోని ప్రేమ కథ అంతగా ఎక్కలేదని.. అందుకే మళ్ళీ కొత్తగా ఈ ప్రేమ కథ గురించి ఆలోచిస్తే బావుంటుంది అని అంటున్నాడట. మరోపక్క సినిమా నిడివి అనుకున్నదానికన్నా కాస్త ఎక్కువే వచ్చింది అని ఎడిటింగ్ లో బాగా షార్ప్ గా కట్ చెయ్యాలని చూస్తున్నారట.

Repairs to Sharwanand Sreekaram:

Re Shoot to Sharwanand Sreekaram
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs