Advertisement
Google Ads BL

తెలుగులో మరో షో కనుమరుగు కానుందా!?


తెలుగులో మరో ప్రముఖ కామెడీ షో కనుమరుగు కానుందా..? ఒకప్పుడు రేటింగ్‌లో టాప్‌లో ఉండే షో.. ఇప్పుడు హఠాత్తుగా ఈ స్థితికి రావడానికి కారణమేంటి..? ఎందుకిలా జరుగుతోంది..? ఎక్కడో ఉన్న ఆ కామెడీ షో.. ఇంత దీనస్థితిలో ఎందుకు పడిపోయాయ్..? అసలు కారణాలేంటి..? యాజమాన్యమే ఆ షోను నెగ్లెక్ట్ చేస్తోందా..? లేకుంటే వీక్షకులు లేరని.. కనుమరుగయ్యే అవకాశాలు మెండుగా ఉండటంతో ఎత్తేయాలని చూస్తున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇదే అక్షరాలా నిజమని తెలుస్తోంది. ఇంతకీ ఆ షో.. ఏంటి..? ఎందుకు ఎత్తేయాలనుకుంటున్నారు..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

Advertisement
CJ Advs

అలా జరిగిపోయింది..!

తెలుగు కామెడీ షోలల్లో ‘పటాస్’ కామెడీ షోకు చాలా ప్రాధాన్యతే ఉంది. ఎందుకంటే.. ఎన్ని షోలు వచ్చినా.. ఈ షోకు ఉండే రేంజే వేరు. అయితే తాజా పరిస్థితులను బట్టి చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయినట్లు అర్థమవుతోంది. ఈ షోకు యాంకర్‌లుగా వ్యవహరిస్తున్న రవి, శ్రీముఖి ఇద్దరూ ఒక్కసారిగా మానేశారు. వాస్తవానికి బిగ్‌బాస్-3కి వెళ్లొచ్చిన తర్వాత కూడా శ్రీముఖి రంగంలోకి దిగుతుంది.. అరుపుల రాములమ్మ మళ్లీ అల్లరి చేస్తుందని ప్రేక్షకులు భావించారు కానీ.. అది జరగలేదు. అప్పటి వరకూ మార్చి.. మార్చి యాంకర్లతో రవి మేనేజ్ చేశాడు. కానీ చివరికి మెగాబ్రదర్ నాగబాబు జడ్జ్‌గా వ్యవహరిస్తున్న ‘అదిరింది’ నుంచి పిలుపురావడం.. ఆశించిన దానికంటే ఎక్కువే పారితోషికం కూడా ఇస్తామనడంతో ఏ మాత్రం ఆలోచించకుండా గోడ దూకేశాడట.

అసలేం జరిగింది..?

దీంతో చలాకీ చంటి, వర్షిణి కొన్ని రోజులు మేనేజ్ చేస్తూ వచ్చారు కానీ.. తాజాగా ‘జబర్దస్త్‌’ కామెడీ షోలో భాగంగా చంటి తన స్కిట్‌లో పదేపదే పటాస్ గురించి ప్రస్తావించడంతో అసలు ఆ షో కనుమరుగు కానుందా..? లేకుంటే చంటిని యాంకర్‌గా పీకేశారా అనేది మాత్రం క్లారిటీ తెలియరాలేదు. ఈ స్కిట్‌లో ఎవరి నోట చూసిన పటాస్.. పటాస్ అనే మాట రావడం.. అరే పోయిన దాని గురించి పదే పదే గుర్తు చేస్తారెందుకు..? అని చంటీ అనడంను బట్టి చూస్తే.. ఏదో సమ్‌థింగ్.. సమ్‌థింగ్ జరుగుతోందని మాత్రం కచ్చితంగా అర్థమవుతోంది. అయితే ప్రస్తుతం ఈ షోకు ముందున్నంతగా రేంజ్ లేదు.. ఎప్పుడో పడిపోయింది కూడా. అంతేకాదు.. యాంకర్స్ సరైన వాళ్లు దొరకట్లేదు. షో కనుమరుగవుతుందన్న వార్తలో నిజానిజాలు తెలియాలంటే కొన్నిరోజులు వేచి చూడక తప్పదు మరి.

Famous Show May Close Soon!:

Famous Show May Close Soon!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs