Advertisement
Google Ads BL

‘ఆంటీ’ అంటే ఈ భామలకు మండింది..!


టాలీవుడ్‌లో సీనియర్ నటీమణులను.. అప్పుడెప్పుడో సినిమాల్లో నటించి ఓ వెలుగు వెలిగి కనుమరుగై.. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన వాళ్లను.. పెళ్లయిపోయిన భామలను అభిమానులు ముద్దుముద్దుగా ఆంటీస్ అంటుంటారు. ఈ మధ్య మోస్ట్ ఎలిజబుల్ హీరోయిన్లను కూడా ఆంటీస్ అనేస్తున్నారు. అయితే ఈ పిలుపును కొందరు యాక్సెప్ట్ చేసి హ్యాపీగా ఫీలవ్వగా మరికొందరు నటీమణులకు మాత్రం మండుతోంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనై అలా అన్నవారికి స్ట్రాంగ్ కౌంటిర్లిస్తున్నారు. తాజాగా.. పూనమ్ కౌర్, వరలక్ష్మి విషయంలోనూ అదే జరిగింది. ఇంతకీ అదేంటో.. ఎందుకలా అన్నారు..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Advertisement
CJ Advs

ఇటీవల పబ్లిక్ ఫోరమ్ అయిన సోషల్ మీడియాలో పూనమ్ కౌర్, వరలక్ష్మిలను కొందరు నెటిజన్లు, అభిమానులు ఆంటీస్ అని సంబోధించారు. ఇటీవలే వరలక్ష్మి బర్త్ డే వేడుకలు ఘనంగా జరుపుకుంది. దీంతో ఆమెకు 35 ఏళ్లు నిండాయా ఆంటీ అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ‘ఎస్, అయితే ఏంటి అంకుల్’ అని ఘాటుగా రిప్లై ఇచ్చింది. దీంతో ఆంటీ అనేవారందరి నోళ్లు మూయించినట్లయ్యింది. ఈ ఘాటు రిప్లయ్‌తో ఆ తర్వాత పెద్దగా ఎవరూ ఆమెను విమర్శించట్లేదు.

అయితే పూనమ్‌కౌర్‌ను కూడా కొందరు ఫ్యాన్స్, నెటిజన్లు ఆటపట్టించారు. ఇటీవల ఓ ఫొటోను ఆ బ్యూటీ పోస్ట్ చేయగా.. ‘వావ్ అదిరిపోయింది ఆంటీ’ అని కామెంట్ చేశాడు. వెంటనే స్పందిస్తూ ‘థ్యాంక్యూ అంకుల్’ స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చింది. వాస్తవానికి మనం రియల్‌ లైఫ్‌లోనే కొందర్ని ఆంటీ అంటే వాళ్లు ఎంతగా చికాకు పడుతుంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాంటిది సోషల్ మీడియాలో అలా ఆంటీ అనేస్తే.. అలా అనిపించుకున్న వాళ్లకి ఎంత ఇబ్బంది అనిపించి ఉంటుందో.. ఆ మాటలు అనేముందు కాస్త ఆలోచిస్తే ఇంత వరకూ వ్యవహారం రానేరాదు. సో.. ఏదైతేనేం ఆంటీ అనగానే ఈ ఇద్దరు ముదరు భామలు ఇలా రియాక్ట్ అవ్వడంతో.. మున్ముంథు ఎవర్నైనా ఇలా అనాలంటే ప్రేక్షకులు, నెటిజన్లకు భయమే మరి.

Poonam, Varalakshmi Angry Over Calls Aunty..!:

Poonam, Varalakshmi Angry Over Calls Aunty..!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs