Advertisement
Google Ads BL

ఏనుగు, చిన్న పిల్లలతో ‘పోయే ఏనుగు పో’ చిత్రం


‘పోయే ఏనుగు పో’ మూవీ టైటిల్ లోగోను విడుద‌ల చేసిన  ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి. 

Advertisement
CJ Advs

ఒక ఏనుగు కొంత మంది చిన్న పిల్లల మధ్య జరిగే అద్భుతమైన సన్నివేశాలతో రూపొందుతున్న చిత్రం ‘పోయే ఏనుగు పో’. కెవి రెడ్డి దర్శకత్వంలో పికెఎన్ క్రియేషన్స్ పతాకంపై ఎం.రాజేంద్రన్ తెలుగు, తమిళంలో ‘పో యానైకుట్టియే పో’ పేరుతో  నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మంచి బాణీలు స‌మ‌కూరుస్తున్నారు.  ఈ చిత్రం తెలుగు  టైటిల్ లోగో, బేనర్ లోగోను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా..

ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ‘‘పోయే ఏనుగు పో టైటిల్ చాలా కొత్తగా ఉంది. దర్శకుడు కెవి రెడ్డి మంచి కథ, మాటలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు తమిళ భాషలలో విడుదల చేయడం మంచి విషయం. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

చిత్ర నిర్మాత ఎం.రాజేంద్రన్  మాట్లాడుతూ - ‘‘మా మూవీ టైటిల్ లోగో, బేనర్ లోగోను విడుదల చేసిన రాజ్ కందుకూరి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.  ఏనుగు, చిన్న పిల్లల మధ్య జరిగే మంచి సన్నివేశాలతో మా దర్శకుడు కెవి రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మంచి కుటుంబ కథా చిత్రం. అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే తెలుగు, తమిళ భాషలో విడుదల చేస్తాం’’ అన్నారు.

సాంకేతిక నిపుణులు :

రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కెవి రెడ్డి,

నిర్మాత: ఎం.రాజేంద్రన్,

కథ: ఎస్. అరవింద్ కేశవన్,

సినిమాటోగ్రఫీ: అమర్. జి,

సంగీతం: భీమ్స్ సిసిరోలియో,

లిరిక్స్ : శ్రీ శ్రీరాజ్,

మాటలు: అవినాష్, రమేష్ రెడ్డి, కెవి రెడ్డి,

ప్రొడక్షన్ మేనేజర్ : మధు  సిహెచ్,

పిఆర్ఓ: సాయి సతీష్.

Poye Enugu Po Movie Title Logo Released:

Raj kandukuri Launches Poye Enugu Po Movie Title Logo
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs