దేవిశ్రీ ప్రసాద్ గతకొంత కాలంగా తన మ్యూజిక్ లో కొత్తదనం లేదని ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మొన్నటికి మొన్న మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు పాటలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో ఇక దేవి పని అయిపోయిందని, కొత్తగా ట్రై చేయలేకపోతున్నాడని సోషల్ మిడియాలో వార్తలు వచ్చాయి. అలాంటి టైమ్ లో దేవిశ్రీ నిరూపించుకోవాల్సిన టైమ్ వచ్చింది. అయితే ప్రస్తుతం దేవి అదే పనిలో ఉన్నట్టు కనబడుతోంది.
మెగా హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతోన్న ఉప్పెన చిత్రానికి దేవి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. నీ కన్ను నీలి సముద్రం అనే పాటకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే స్థాయిలో మరో పాట కూడా రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ధక్ ధక్ ధక్ అంటూ సాగే ఈ వీడియో ప్రోమో చాలా మందిని ఆకర్షించింది.
దేవిశ్రీ మ్యూజిక్ తో పాటు చంద్రబోస్ సాహిత్యం చాలా ప్లస్ అయింది. కాలానికి కరువొస్తే, గుండెకు చెమట పడితే లాంటి అద్భుతమైన పద ప్రయోగాల్ని ఉపయోగించి ఆసక్తి రేపారు. ఇక ఈ పాట చిత్రీకరించిన విధానం కూడా చాలా బాగుందని అంటున్నారు. జస్ట్ రెండు నిమిషాలు కూడా లేని ఈ ప్రోమో మిలియన్ మందిని ఆకర్షించడం అంటే చిన్న విషయం కాదు. ఇదంతా చూస్తుంటే ఉప్పెన చిత్రం బాక్సాఫీసు వద్ద ఉప్పెన రేపుతుందేమో అనిపిస్తుంది.