Advertisement
Google Ads BL

బన్నీ మీద కోపమా.. లేక పవనంటే పిచ్చా?


పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓ ఫంక్షన్స్ లో అల్లు అర్జున్ ని తగులుకున్నారు. అల్లు అర్జున్ ఏదో చెప్పను బ్రదర్ అన్నాడని అప్పటినుండి ఇప్పటివరకు అల్లు అర్జున్ ని పవన్ ఫ్యాన్స్ వదలడం లేదు. అల్లు అర్జున్ ఎన్నిసార్లు పవన్ తో సయోధ్యగానే ఉన్నా అని చూపిస్తున్న, పవన్ ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ ఎక్కడ దొరుకుతాడా అక్కడ నొక్కేద్దాం అన్నట్టుగా చూస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మ్యూజికల్ హిట్ అయిన విషయం తెలిసిందే. అల వైకుంఠపురములో సాంగ్స్ ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యంలా యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉన్నాయి. సినిమా విడుదలయినా ఇప్పటికి ఆ సాంగ్స్ యూట్యూబ్ రికార్డ్స్ ని కొల్లగొడుతూనే ఉన్నాయి.

Advertisement
CJ Advs

అయితే అప్పటి కడుపు మంటతో పవన్ ఫ్యాన్స్ తాజాగా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ సినిమా విషయంలో అల్లు అర్జున్ రికార్డులకు చుక్కలు చూపెట్టే ప్రయత్నం స్టార్ట్ చేసారు. వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ తోనే ఏదో చేద్దామనుకుంటే.. దానికి మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో ఊరుకున్న పవన్ ఫ్యాన్స్ తాజాగా వకీల్ సాబ్ మగువా మగువా సాంగ్ లిరిక్ ని ట్రేండింగ్ లోకి తీసుకొచ్చి.... అల వైకుంఠపురములో సాంగ్స్ కన్నా వకీల్ సాబ్ ముగువా మగువా సాంగ్ కే ఎక్కువ వ్యూస్ వచ్చాయంటూ సోషల్ మీడియాలో హంగామా మొదలెట్టారు. అది అల్లు అర్జున్ మీద మంటో.. లేదంటే.. పవన్ మీద పిచ్చో గాని.. వకీల్ సాబ్ మగువా మగువా సాంగ్ ట్రేండింగ్ అంటూ పవన్ ఫ్యాన్స్ హంగామా చేసినట్టుగా ఏమి లేదు.. సిద్ శ్రీరామ్ మాయ చేసాడు. బట్ అల వైకుంఠపురములో అంత కాదు. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం ఒప్పుకోవడం లేదు. తమ హీరో క్రేజ్ ముందు అందరూ బలాదూరే అంటూ సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు.

Pawan Kalyan Fans Hungama at Social Media:

Vakeel Saab Maguva song vs Ala Vaikunthapurramloo songs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs