చిరు లాంటి బ్రేక్ డాన్సర్ ఇప్పటి వరకు లేరంటే అతిశయోక్తి లేదు. చిరంజీవితో హీరోయిన్స్ డాన్స్ చెయ్యాలి అంటే చాలా కష్టపడేవారు. వారిలో విజయశాంతి, రాధలాంటి హీరోయిన్స్ మాత్రమే చిరుతో భారీ స్టెప్స్ వేసి ఆకట్టుకునేవారు. ఇక చిరు ఫామ్ తగ్గాక ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ డాన్స్ లకు క్రేజ్ వచ్చింది. అయితే ఇప్పుడొక కుర్ర హీరోయిన్ చిరుతో డాన్స్ అంటే వదిలే సమస్యే లేదంటుంది. ఆమె రెజీనా. చిరంజీవి - కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో రెజీనా ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పటికే ఆ సాంగ్ చిత్రీకరణ పూర్తయ్యింది.
అయితే తాజాగా రెజీనా, చిరు సినిమాలో ఐటెం సాంగ్ గురించి మట్లాడుతూ.. తనకి డాన్స్ అంటే చాలా ఇష్టమని, అందుకే కొరటాల - చిరు సినిమాలో స్పెషల్ సాంగ్ కి అడగ్గానే ఒప్పుకున్నా అని.. అయితే చిరంజీవి గారితో డాన్స్ చేసే అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటా అంటూ చిరు కాబట్టే మరో ఆలోచన లేకుండా ఈ స్పెషల్ సాంగ్ కి ఓకే చెప్పా అని.. ఈ సాంగ్ ని కొరటాల 6 డేస్ లో చిత్రీకరణ పూర్తి చేసారని చెప్పడమే కాదు... రెజీనా డాన్స్ చూసి చిరంజీవి మెచ్చుకున్నారని కూడా చెబుతుంటుంది. అయితే చిరు సినిమాలో తాను చేసిన సాంగ్ ని ఐటెం సాంగ్ అని పిలవకూడదట . స్పెషల్ సాంగ్ అని పిలవాలట.