Advertisement
Google Ads BL

మహేష్ ట్విట్టర్ కింగ్ అయితే.. అల్లు అర్జున్?


మహేష్ బాబు, అల్లు అర్జున్ అనేక రంగాల్లో పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. ఈమధ్యనే సంక్రాంతి ఫైట్ అంటూ మహేష్ - అల్లు అర్జున్ తమ తమ సినిమాలతో ఢీ కొట్టారు. అందులో అల్లు అర్జున్ పై చెయ్యి సాధించగా మహేష్ కొద్దిగా వెనకబడ్డాడు. ఇక మహేష్ యాడ్స్ విషయంలో ఎవరికి అందనంత క్రేజ్ తో అందనంత ఎత్తులో ఉన్నాడు. అల్లు అర్జున్ స్టయిల్ పరంగా ఏ హీరోకి అందనంత ఎత్తులో నిలబడ్డాడు. అయితే తాజాగా అల్లు అర్జున్ - మహేష్ మధ్యన మరో వార్ కి తెర లెగిసింది. అదేమంటే మహేష్ 9 మిలియన్ల అభిమాన గణంతో ట్విట్టర్ రారాజుగా వెలిగిపోవడమే కాదు.. మహేష్ గురించి ప్రతి వెబ్ సైట్ లోను ట్విట్టర్ కింగ్ అంటూ వార్తలొచ్చాయి.

Advertisement
CJ Advs

తాజాగా అల్లు అర్జున్ కూడా ఫేస్ బుక్ కింగ్ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారంలోకొచ్చింది. గణాంక సమాచారం ప్రకారం... అల్లు అర్జున్‌కు ఫేస్‌బుక్‌లో 12.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు ఆ తర్వాత ప్రభాస్ 10+ మిలియన్ల మంది ఫాలోవర్లతో ఉండగా మహేష్ 5.5 మిలియన్ల మార్క్ తో ఫేస్ బుక్ లో కొనసాగుతున్నాడు. మరి ట్విట్టర్ లో మహేష్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా అల్లు అర్జున్ రెండో ప్లేస్ లో ఉన్నాడు. ఇప్పుడు మహేష్ ట్విట్టర్ కింగ్ అయితే మా అల్లు అర్జున్ ఫేస్ బుక్ కింగ్ అంటూ అల్లు అర్జున్ అభిమానులకు పూనకాలొచ్చేస్తున్నాయ్. సరిలేరు - అల వార్ కన్నా ఎక్కువగా ఇప్పుడు సోషల్ మీడియా ఫాలోవర్స్ వార్ ఎక్కువయ్యేలా కనబడుతుంది అంటున్నారు.

Again war between Mahesh and Allu Arjun about Social Media:

Mahesh babu Twitter King - Allu Arjun Facebook king
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs