ఓ సరికొత్త కథాంశంతో, ఇంతవరకు తెరపై రాని ఒక వినూతనమైన కాన్సెప్ట్ తో వాల్మీకి రచిస్తోన్న ఒక దృశ్య కావ్యం ‘ఘాఠి`. రామ్‌ధన్ మీడియా వర్క్స్ పతాకంపై దిలీప్ రాథోడ్ డా.పూనమ్ శర్మ హీరో హీరోయిన్లుగా వాల్మీకి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. తెలుగు, బంజార భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ట్రైలర్ తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌెడ్, నిర్మాత, నటుడు ఎ.గురురాజ్ చేతుల మీదుగా ఈ రోజు ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది.
ఈ సందర్భంగా డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ... ‘ట్రైలర్ చూశాక దర్శకుడి ప్రతిభ ఏంటో అర్థమైంది. ఇంత వరకు తెరపై చూపించని కొత్త కంటెంట్ చూపిస్తున్నారు. దిలీప్ రాథోడ్ కి హీరోగా మంచి సినిమా అవుతుంది. చిత్ర యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు’’ అన్నారు.
ఎ.గురురాజ్ మాట్లాడుతూ...‘ట్రైలర్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. ప్రతి ఫ్రేమ్‌లో రిచ్‌నెస్ కనిపిస్తోంది. వాల్మీకి ఒక కొత్త నేపథ్యాన్ని మనకు పరిచయం చేస్తున్నారు. ఇటీవల బంజార భాషల్లో వస్తోన్న చిత్రాలు ఆడుతున్నాయి. అదే కోవలో తెలుగు బంజార భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం విజయం సాధించి పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు తేవాలన్నారు.’
హీరో దిలీప్ రాథోడ్ మాట్లాడుతూ...‘‘ఈ సినిమా కోసం దర్శకుడు వాల్మీకి ఎంతో శ్రమించారు. షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. ఒక మంచి సినిమాలో నటిస్తుందన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాతో ఎంతో మంది ప్రతిభావంతులు సినిమా పరిశ్రమకు పరిచయం అవుతున్నారు’’ అన్నారు.
దర్శక నిర్మాత వాల్మీకి మాట్లాడుతూ... ‘‘ఇది నా మూడో సినిమా. ఘాఠి సినిమా విషయానికొస్తే ‘‘రాజస్థాన్‌లో ‘ఘాఠి’ అనే ఒక ప్రాంతంలో జరిగే కథ ఇది. బంజారవారికి మార్వాడీస్‌కి మథ్య చిన్న గొడవ రావడంతో బంజార వారు ఘాఠి ప్రాంతాన్ని వదిలేయాల్సి వస్తుంది. వారి మధ్య జరిగిన గొడవ ఏంటి? తిరిగి ఘాఠికి చేరుకున్నారా? లేదా? అన్నది చిత్ర కథాంశం. లవ్, ఎమోషన్, యాక్షన్ అంశాలు ఉంటాయన్నారు.’’
అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్ నేను అనుకున్నదానికన్నా చాలా బాగుంది. వాల్మీకి పెద్ద దర్శకుడు అయ్యే అవకాశాలున్నాయి. యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు’’ అన్నారు.
బంజార జాతీయ అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ..‘‘ఇటీవల బంజార కథాంశంతో ఘోర్ జీవన్ అనే సినిమా వచ్చింది. పెద్ద సక్సెస్ అయింది. దేశంలో బంజార మాట్లాడేవారి సంఖ్య అధికంగానే ఉంది. ఇకపై బంజార భాషల్లో చిత్రాలు రూపొందించాలని, వాటికి మా సహకారం సంపూర్ణంగా ఉంటుంది’’ అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: నాగ వంశీ, డిఓపి: విజయ్ ఠాగూర్, విఎఫ్‌ఎక్స్: సుపిడో విజేంద్ర, నిర్మాత, దర్శకుడు: వాల్మీకి.