Advertisement
Google Ads BL

ఈ హీరో సోషల్ మీడియా అకౌంట్‌పై లాయర్ల వివరణ!


ఒకప్పుడు సోషల్ మీడియాని మెయింటింగ్ చేసే వారు చాలా తక్కువమంది ఉండేవారు. ఏ పనిపాట లేనివాళ్ళు మాత్రమే ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఉండేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో లేకపోతే జనాలు ఏమనుకుంటారో అనే స్టేజ్ కి వచ్చేసారు చాలామంది. ఏ విషయమైనా నిమిషాల్లో ప్రజలకు చేరడానికి సోషల్ మీడియానే కారణం. ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో ఏ ఫేస్ బుక్ అకౌంటో.. ట్విట్టర్ అకౌంటో.. లేదంటే కొత్తగా వచ్చాయి ఇన్స్టా లాంటివి ఉండాల్సిందే. అయితే  సినిమా ఇండస్ట్రీనే కాదు... పొలిటికల్ లీడర్స్ వరకు సోషల్ మీడియా ద్వారానే ప్రాచుర్యం పొందుతున్నారు. కానీ ఓ హీరోకి సోషల్ మీడియా అంటే చిరాకట. సాంఘీక మాధ్యమాల్లో ఇంతవరకు ఆ హీరోకి ఒక్క అకౌంట్ కూడా లేదు. ఇకపై కూడా ఉండదని చెబుతున్నారు.

Advertisement
CJ Advs

కోలీవుడ్ లో రజినీకాంత్  - విజయ్, అజిత్ అంటే విపరీతమైన క్రేజ్. అంత క్రేజున్న అజిత్ ఎప్పుడూ సోషల్ మీడియాలో చిన్న ట్వీట్ చేసినట్లు లేదు. ఎందుకంటే అజిత్ కి ఇంతవరకు సాంఘీక మాధ్యమాల్లో అకౌంట్ అనేదే లేదు. విజయ్ అభిమానులకు అజిత్ అభిమానులకు సోషల్ మీడియాలో కోల్డ్ వార్ కాదు.. స్ట్రయిట్ వార్ చేస్తుంటారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ తెగ ఫైటింగ్ చేస్తుంటారు. అయినా ఎప్పుడూ అజిత్ స్పందించడు. అయితే తాజాగా అజిత్ సోషల్ మీడియా అధికారిక అకౌంట్ అంటూ.. నేను ఇప్పుడున్న పరిస్థితుల వలన సాంఘీక మాధ్యమాలలో అడుగుపెట్టాలనుకుంటున్నాను అని.. అజిత్ సైన్ తో ఉన్న ఓ లేఖ సోషల్ మీడియాలో వచ్చేసరికి అందరూ అజిత్ నిజంగానే సోషల్ మీడియాలో అడుగుపెట్టాడనే అనుకున్నారు.

ఎందుకంటే ఆ లేఖలో అజిత్ సంతకం ఉండడంతో అభిమానులు కూడా అజిత్ సోషల్ మీడియాకి వచ్చేసాడనుకున్నారు. కానీ తాజాగా అజిత్ ఎలాంటి లేఖ సోషల్ మీడియాలోకి ఇవ్వలేదని.. అసలు అజిత్ కి సాంఘీక మాధ్యమాలలో ఆడుగుపెట్టాలని లేదని.. అజిత్ సంతకం చూసి ఆశ్చర్యపోయామంటూ అజిత్  తరపు లాయర్లు షాకవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఆయనకి అకౌంట్ కానీ.. అభిమాన సంఘాలకు గాని ఆయన ఎలాంటి పోస్ట్ చెయ్యడం లేదని లాయర్లు వివరణ ఇచ్చారు.

No Social Media Account to Star Hero Ajith:

Ajith Lawyers Clarity about his Social Media Accounts
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs