Advertisement
Google Ads BL

‘జనతా గ్యారేజ్’లో బాలయ్యని అందుకే పెట్టలేదంట!


ఎన్టీఆర్ - బాలకృష్ణ కలిసి నటిస్తే నందమూరి ఫ్యాన్స్ కి పండగే. ఆ క్షణం కోసం నందమూరి ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ అబ్బాయ్ - బాబాయ్ మాత్రం ఆ విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ.. ఫ్యాన్స్ అప్పుడప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ని తమ అభిమాన హీరోలను కలిపి ఎప్పుడు సినిమా తీస్తారు అని అడుగుతుంటారు కూడా అయితే తాజాగా నందమూరి ఫ్యాన్స్ కొరటాల శివ, ఎన్టీఆర్ తో తెరకెక్కించిన జనతా  గ్యారేజ్ లో మోహన్ లాల్ చేసిన పాత్రలో బాలకృష్ణని తీసుకుంటారేమో అనుకున్నాం, ఆయన్ని తీసుకుంటే బావుండేది అని అడగగా.. దానికి కొరటాల శివ.. బాలకృష్ణ - ఎన్టీఆర్ కలిసి సినిమా చేస్తే ఆ అంచనాలు ఆకాశంలో ఉంటాయి.

Advertisement
CJ Advs

సినిమాలో బాలయ్య - ఎన్టీఆర్ కాంబో సీన్స్ ఉంటే చాలు. ఇంకేం అక్కర్లేదు అనుకుంటారు ఫ్యాన్స్. అలాగే ఎన్టీఆర్ - బాలయ్య కలిపి సినిమా అంటే వాళ్ళిద్దరి మధ్యన సీన్స్ ఎలా ఉంటాయి, ఏ రేంజ్ లో ఉంటాయి అని ఆలోచిస్తారు కానీ.. సినిమా కథ ఎలా ఉందో పట్టించుకోరు. కానీ జనతా గ్యారేజ్ కథాబలం ఉన్న సినిమా. అలాగే సత్యం పాత్ర అదే మోహన్ లాల్ పాత్రకి బాలయ్య సూట్ కారనే ఆయనని అనుకోలేదు. అలాగే జనతా గ్యారేజ్ కథాబలమున్న సినిమా కావడం వలనే ఎన్టీఆర్ ని, మోహన్ లాల్ ని పెట్టాం. అంతేకాని బాలయ్య వద్దని కాదు. ఇక బాలకృష్ణ - ఎన్టీఆర్ కలయికలో ఎప్పటికైనా ఓ సినిమా రావొచ్చు. దాని కోసం మీతో పాటు నేను ఎదురు చూస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు కొరటాల శివ.

Koratala siva talks about Mohan Lal Role in Janatha Garage:

Koratala about Balayya and JR NTR Combo
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs