Advertisement
Google Ads BL

మహేష్‌పై నెగిటివ్‌గా ఏమైనా రాశారో.. ఇక అంతే!


మహేష్ బాబు భార్య నమ్రత కొంతకాలం నుండి మహేష్ సినిమాల విషయంలోనూ, మహేష్ బిజినెస్ ల విషయంలోనూ ఓ టీంని పెట్టుకుని మరీ పబ్లిసిటీ విషయాలను పర్ఫెక్ట్ గా మెయిటైన్ చేస్తుంది. మెహర్ రమేష్ లాంటోళ్ళు నమ్రత వెనకాలే ఉంటూ నమ్రత చెప్పినవి  చెప్పినట్టుగా ఆచరణలో  పెడుతున్నట్టుగా ప్రచారం ఉంది. అయితే నమ్రత మహేష్ స్టోరీ సిట్టింగ్ లోను పార్టిసిపేట్ చేస్తుంది అని.. గతంలోలా మహేష్ కేవలం పిఆర్ టీమ్ నే నమ్ముకోవడం లేదని సొంత మనుషులుగా మహేష్ కి నీడలా ఉండే వాళ్ళు మహేష్ కి హెల్ప్ చేస్తున్నట్లుగా ఫిలింనగర్ గుసగుసలు. స్పైడర్ సినిమా అప్పటి నుండి నమ్రత మహేష్ విషయంలో తెగ జాగ్రత్తలు తీసుకుంటుంది అని అంటున్నారు. ప్రస్తుతం కూడా నమ్రత మహేష్ విషయంలో చాలా యాక్టీవ్ గా తన టీమ్ తో కలిసి పనిచేస్తుంది అని... సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ సినిమా విషయం ఇంకా సందిగ్ధంలో ఉండడం, వంశీ పైడిపల్లితో సినిమా ఆగిపోవడంతో మీడియాలో రకరకాల న్యూస్ లు ప్రచారంలోకొచ్చాయి.

Advertisement
CJ Advs

అందులో కొన్ని గాసిప్స్ ఉన్నాయి.. కొన్ని నిజాలు ఉన్నాయి. అయితే నమ్రత ఇప్పుడు మహేష్ మీద కొన్ని వెబ్ సైట్స్, సోషల్ మీడియాలో వస్తున్న నెగెటివ్ న్యూస్ ల మీద ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఏ వెబ్ సైట్ లో అయినా, లేదంటే ఫేస్ బుక్ లో అయినా మహేష్ మీద నెగెటివ్ న్యూస్ పడగానే నమ్రత రంగంలోకి దిగి తన టీంతో వారికి ఫోన్స్ చేయించి ఆ న్యూస్ లను డిలీట్ చేయించే ప్రోగ్రాం పెట్టుకుంది. పలు వెబ్ సైట్స్ మహేష్ ని పాజిటివ్ గా ప్రమోట్ చేస్తూ.. మహేష్ టీంని సంతోషపరుస్తున్నారని.. కానీ  అప్ప్పుడప్పుడు మహేష్ మీద నెగెటివ్ ఆర్టికల్స్ పడుతుంటే మాత్రం వెంటనే ఫోన్ వస్తుందట. మరి మహేష్ ప్రస్తుతం ఎలాంటి సినిమా ఒప్పుకోకుండా ఉండడంతో నమ్రత ఇలా చేస్తుంది. మహేష్ నెక్స్ట్ సినిమా ఓకే అవ్వగానే ఆ సినిమాని ఎలా ప్రమోట్ చేయించాలి అనేది నమ్రత తన టీంకి ముందునుండే ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుందట. 

Namrata shirodkar Involvement on Mahesh Revealed:

Namrata Shirodkar - the Power Behind Mahesh Babu’s Throne
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs