మార్చ్ నెలలో మొదటివారం మూడు సినిమాలు రిలీజ్ అయినా వాటిల్లో ఏవీ అంతగా ప్రేక్షకులని ఆకర్షించలేకపోయాయి. ఓ పిట్ట కథ, అనుకున్నది ఒకటి అయినదొకటి, పలాస 1978 చిత్రాలు థియేటర్ల వద్ద ఉన్నా కూడా పదవ తరగతి విద్యార్థులకి, ఇంటర్మీడియెట్ విద్యార్థులకి ఉన్న ఎగ్జామ్స్ వల్ల ఎవ్వరూ థియేటర్లకి రావట్లేదని సమాచారం. అదీగాక కరోనా వైరస్ కూడా ప్రజల్ని థియేటర్లకి రాకుండా చేస్తుంది.
ఇలాంటి టైమ్ లో థియేటర్లని జనం లేక వెలవెలబోతున్నాయి. అయితే తర్వాతి రెండు వారాలు కూడా థియేటర్ల వద్ద ఇదే పరిస్థితి కొనసాగనుంది. మార్చ్ 25 న ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వంలో నాని చేస్తున్న వి సినిమా కోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు. అప్పటి వరకు విద్యార్థులకి కూడా ఎగ్జామ్స్ పూర్తి అవుతాయి. కాబట్టి నాని సినిమాకి ఫ్యామిలీస్ ఆడియన్స్ చాలా ప్లస్ అవుతారు. అయితే దానికంటే ముందు సినిమా ప్రమోషన్లు స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు.
సినిమా విడుదలకి ఇంకా ఇరవై రోజులు టైమ్ ఉన్న నేపథ్యంలో ఇప్పడి నుండే వి సినిమా అప్డేట్లు రివీల్ చేయాలని అంటున్నారు. సినిమాలేవీ లేని టైమ్ లో జనాల్లోకి కరెక్ట్ గా సినిమాని తీసుకెళ్ళగలిగితే రిలీజ్ అయ్యాక దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని సలహా ఇస్తున్నారు. అంతే కాదు ప్రమోషన్ల విషయంలో అల వైకుంఠపురములో చిత్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. కనీసం పాటలు విడుదల చేస్తూ జనాలకి ఆసక్తి కలిగించేలా చేయాలని చెప్తున్నారు. మొత్తానికి బాక్సాఫీసు వద్ద కనబడుతున్న ఎమ్టీనెస్ ని నాని ప్రమోషన్ల ద్వారా ఫుల్ ఫిల్ చేయాలని కోరుతున్నారు.