Advertisement
Google Ads BL

‘వి’ విషయంలో అలిగిన హీరో..!!


నాని హీరోగానే కాదు.. నిర్మాతగానూ చెలరేగిపోయాడు. హీరోగా వరస సినిమాలు.. నిర్మాతగా హిట్ తో హిట్ కొట్టేసాడు. అయితే తాజాగా నాని ని చూసి మరో హీరో గుర్రుగా ఉన్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. నాని గ్యాంగ్ లీడర్ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ అడిగాడని.. వి వినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సుధీర్ బాబే హీరో. నాని విలన్. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో సుధీర్ బాబు ని సైలెంట్ చేసి నాని హీరో ని చేస్తున్నారనే టాక్ నడవడమే కాదు.. ఈ విషయంలో సుధీర్ బాబు కూడా మూవీ యూనిట్ మీద గుర్రుగా ఉన్నాడనే టాక్ మొదలయ్యింది.

Advertisement
CJ Advs

వి టీజర్లోనూ నాని 25వ చిత్రం అంటూ వెయ్యడం.. ఎక్కువగా నాని కే ఇంపార్టెన్స్ ఇస్తూ పబ్లిసిటీ మొదలెట్టడంతో.. సుధీర్ బాబు కక్కలేక మింగలేక ఉన్నాడని.. ఇప్పటికే ఇంద్రగంటి దగ్గర కూడా ఈ విషయంలోపంచాయితి పెట్టినట్లుగా తెలుస్తుంది. అయితే నానికి కూడా తెలియకండా నానినే ప్రమోట్ చేస్తూ వి సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయని సుధీర్ బాబు అలక బూనినట్లుగా ప్రచారం అయితే సోషల్ మీడియాలో జోరందుకుంది. నాని హీరో నా నేను హీరోనా అంటూ సుధీర్ బాబు ఇంద్రగంటిని కూర్చోనివ్వడం లేదట. దీనితో ఇంద్రగంటి కూడా కాస్త ఇబ్బందిపడుతున్నట్లుగా న్యూస్.

V Hero Sudheer Babu angry on Mohan Krishna Indraganti:

Sudheer Babu not happy with V Film 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs