Advertisement
Google Ads BL

‘మ‌ధ’ టీజ‌ర్ వదిలిన రకుల్ ప్రీత్ సింగ్


‘మ‌ధ’ టీజ‌ర్ విడుద‌ల చేసిన ప్ర‌ముఖ హీరోయిన్‌ ర‌కుల్ ప్రీత్ సింగ్‌

Advertisement
CJ Advs

ఒక‌టి, రెండు అవార్డులు కావు.. ఏకంగా 26 ఇంట‌ర్నేష‌న‌ల్‌ ఫిలిం ఫెస్టివ‌ల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న చిత్రం ‘మ‌ధ‌’. థర్డ్ ఐ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్, త్రిష్నా ముఖర్జీ హీరో హీరోయిన్లుగా శ్రీవిద్య ద‌ర్శ‌క‌త్వంలో ఇందిరా బ‌స‌వ నిర్మించిన ఈ చిత్రం మార్చి 13న విడుద‌ల కానుంది. ఈ సినిమా టీజ‌ర్‌ను ప్ర‌ముఖ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ విడుద‌ల చేశారు. 

‘‘చాలా చాలా అరుదుగా మనం చూసే చిత్రాల్లో ‘మధ’ ఒకటి. డైరెక్టర్ శ్రీవిద్య బసవ ఈ సినిమా కోసం చేసిన ప్రయాణం నన్ను ఇన్‌స్పైర్ చేసింది. టీజర్ నాలో ఆసక్తిని రేపింది. అద్భుతమైన టీజర్. ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు’’ అంటూ చిత్ర యూనిట్‌ని అభినందించారు రకుల్ ప్రీత్ సింగ్. 

టీజర్ విషయానికి వస్తే.. ఓ అమ్మాయి మానసిక సమస్యల గురించి చెప్పే చిత్రంగా మధ కనిపిస్తుంది. ‘నేను ఈ ప్రపంచాన్ని చదివింది..చూసింది ఈ కిటికీలో నుండే’ అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. త్రిష్నా ప్రధాన పాత్రలో నటించింది. ఆమె చుట్టూనే కథంతా తిరుగుతుంది. ఆమె ఏదో మానసిక సమస్యతో బాధపడుతుందని, దేనికో భయపడుతుందని టీజర్ ద్వారా చెప్పారు డైరెక్టర్ శ్రీవిద్య బసవ.  టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. 

ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీవిద్య మాట్లాడుతూ - ‘‘‘మధ’ చిత్రం టీజర్‌ను విడుదల చేసి మా యూనిట్‌ను ఎంకరేజ్ చేసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కి అభినందనలు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నమైన చిత్రం. ఈ సినిమా చేయడానికి మూడేళ్ల జర్నీ చేశాం. నాతో పాటు ఎంటైర్ యూనిట్ ఎంతగానో కష్టపడ్డారు. అలాగే మా సినిమా విడుదలకు సపోర్ట్ చేస్తున్నహ‌రీశ్‌గారు, మ‌హేశ్‌గారు, న‌వ‌దీప్‌గారికి థాంక్స్‌. ప్ర‌తి అమ్మాయి ఈ సినిమా కాన్సెప్ట్‌కి క‌నెక్ట్ అవుతుంది. స్త్రీ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను చూపిస్తున్నాం. మార్చి 13న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం. కంటెంట్ అంద‌రికీ నచ్చుతుంది’’ అన్నారు. 

Click Here for Teaser

Rakul Preet Singh Launches Madha Teaser:

Madha Movie Teaser Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs