Advertisement
Google Ads BL

కరోనా విజృంభిస్తుంటే సూపర్ మాన్ లు ఏం చేస్తున్నారు.. వర్మ


ప్రపంచ వ్యాప్తంగా డెభ్బై దేశాలకి పైగా విస్తరించి సుమారు రెండువేల మందికి పైగా ప్రాణాలని బలిగొన్న మహమ్మారి కరోనా గురించి ప్రతీ ఒక్కరూ చర్చించుకుంటున్నారు. అసలు వ్యాక్సిన్ కనుగొనబడని ఈ వైరస్ నుండి తమ ప్రాణాలని కాపాడుకోవాలని చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. ఈ అప్రమత్తత వల్ల రోజువారి జీవితంలో చాలా మార్పులే వచ్చాయి. ముఖ్యంగా ప్రతీ ఒక్కరూ మాస్క్ వేసుకోవడం కంపల్సరీ అయిపోయింది.

Advertisement
CJ Advs

అయితే ఏ విషయం మీదనైనా తనదైన శైలిలో స్పందించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సారి కరోనా మీద పడ్డాడు. కరోనా హైదరాబాద్  ని తాకిందని వార్తలు వచ్చినప్పటి నుండి ఆ వైరస్ గురించి వస్తున్న రకరకాల ఊహాగానాలకి తనదైన సెటైర్ లు వేస్తూ  ప్రతిస్పందిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు చేసిన ట్వీట్ బాగా ఆసక్తి కలిగించింది. హాలీవుడ్ మూవీల్లో ఏదైనా కష్టం రాగానే సూపర్ మాన్ లు, బ్యాట్ మెన్ లు, స్పైడర్ మాన్ లు వచ్చి ఆ కష్టం నుండి బయటపడేస్తారు.

ప్రస్తుతం కరోనా ప్రపంచాన్నే గడగడలాడిస్తుంటే వాళ్లంతా ఎక్కడికి వెళ్ళారని ప్రశ్నించాడు. అంతేకాదు వారు వేరే గ్రహం మీదకి వెళ్ళిపోయారని మాత్రం చెప్పకండి అంటూ పోస్ట్ పెట్టాడు. ఎప్పుడూ ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టే వర్మ ఈ సారి కరోనాని టార్గెట్ చేశాడు. ఇక్కడ ఆనందించాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం వర్మ పోస్టుల వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడట్లేదు.

varma asked super mans to do something for corona:

what super mans are doing when corona spread all over the world Varma asked
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs