Advertisement
Google Ads BL

ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ వార్ నిజమేనా..?


బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో కాకపోయినా మంచి గట్టి ఇంపాక్ట్ చూపించిన చిత్రం కేజీఎఫ్. అసలేమాత్రం బజ్ లేకుండా వచ్చి బాక్సాఫీసు వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది ఈ చిత్రం. అప్పటి నుండి కేజీఎఫ్ లో నటించిన హీరో యశ్ కి ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ కి ఆఫర్లు వరుస కట్టాయి. అయితే బాహుబలి మాదిరిగానే కేజీఎఫ్ సెకండ్ పార్ట్ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
CJ Advs

కేజీఎఫ్ 2 విడుదల తేదీని ఇంతవరకు ప్రకటించలేదు. దాంతో ఈ చిత్రం ఆర్ ఆర్ తో పోటీపడబోతుందని వార్తలు వస్తున్నాయి. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 8 వ తేదీన విడుదల అవుతుంది. దానికి పోటీగా కేజీఎఫ్ 2 ని కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నట్లు అంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని దానికి గల కారణాలని కూడా వివరిస్తున్నారు.

ఈ రెండు చిత్రాలు కూడా దక్షిణాది నుండి తెరకెక్కుతున్నవే. అదేగాక కేజీఎఫ్ సినిమా వచ్చి సంవత్సరం దాటిపోయింది. ఇంకా మరో సంవత్సరం వెయిట్ చేయడమంటే సరైన ఆలోచన కాదని అంటున్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ రెండు చిత్రాలని హిందీలో రిలీజ్ చేస్తుంది ఒక్కరే కావడం వల్ల రెండూ ఒకే సమయంలో విడుదల అవడం అసాధ్యమని చెబుతున్నారు. అన్ని చెప్పినా కేజీఎఫ్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందో మాత్రం రివీల్ చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది.

Is it real, war between RRR and kgf :

rumours spread over the industry that KGF is going to release with RRR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs