Advertisement
Google Ads BL

ఉప్పెనతో దేవిశ్రీ దూసుకొచ్చాడుగా..!


సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే కెరీర్ ముందుకు సాగుతుంది. అది హీరో అయినా, హీరోయిన్ అయినా, మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్ ఇలా ప్రతీ ఒక్కరి కెరీర్ ముందుకు సాగాలన్నా సక్సెస్ అనేది రావాల్సిందే. అయితే కెరీర్ మొదట్లో వరుస సక్సెస్ లు అందుకుని టాప్ కి చేరుకున్నాక ఒకానొక టైమ్ లో కాలానికి అనుగుణంగా క్రియేటివిటీని పెంచుకోలేకపోవడమో.. లేక కొన్ని సార్లు తెలియకుండానే ఫెయిల్ అవుతూ ఉంటారు.

Advertisement
CJ Advs

ప్రతీ సినిమా కళాకారుడికి ఇలా జరగడం సహజమే. మొన్నటివరకు ఇలాంటి ఫేజ్ లో పడ్డ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. దేవి ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగాడు. స్టార్ హీరో సినిమా అంటే అందరూ దేవిశ్రీ వైపే చూసేవారు. అలాంటిది కొన్నాళ్ళ నుండి తనకి పోటీదారుడయిన థమన్ తో పోటీపడలేకపోయాడు. అదీ గాక దేవిశ్రీ మ్యూజిక్ లో కొత్తదనం లేదని పాత ట్యూన్లనే మళ్ళీ మళ్ళీ కొడుతున్నాడని అన్నారు.

అయితే తన మీద వచ్చిన విమర్శలన్నింటినీ ఉప్పెన సాంగ్ తో పోయేలా చేశాడు దేవి.  బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ఉప్పెన చిత్రానికి దేవిశ్రీనే సంగీతం అందిస్తున్నాడు. మొదటి పాటగా నీ కన్ను నీలి సముద్రం అనే పాటని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్ లో ఉంది. కోటి వ్యూస్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. దీంతో దేవిశ్రీ బ్యాక్ అయినట్టే అని తెలుస్తుంది. ఈ పాటతో సినిమా మీద బాగా ఆసక్తి పెరిగింది. మరి సినిమా విజయంలో పాటలు ఎంతవరకు తోడ్పడతాయో చూడాలి. మొత్తానికి దేవిశ్రీ నుండి ఏం కావాలని కోరుకున్నారో అది వచ్చేసింది.

Devi sri back with his song:

Uppena song reached 10 million people
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs