Advertisement
Google Ads BL

అమ్మతోడు ఎవ్వరినీ వదలను.. : రాహుల్ సిప్లిగంజ్


తెలుగు బిగ్‌బాస్ సీజన్- 3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై ఇటీవల ఓ పబ్‌లో బీరు సీసాలతో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు కారుకులు ఎమ్మల్యే తమ్ముడు, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారని హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే.. పోలీసులు పట్టించుకోలేదని భావించిన రాహుల్.. సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై యుద్ధం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు జరిగిన విషయమంతా ట్విట్టర్ వేదికగా నిశితంగా వివరించి.. సీసీటీవీ ఫుటేజీలను సైతం జతపరిచాడు.

Advertisement
CJ Advs

నేనెందుకు చిక్కుకోవాలి..!

తనకు కేటీఆర్ గారే న్యాయం చేయాలని వేడుకున్నాడు. తాను టీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేశానని పార్టీ కోసమే నిలబడ్డానన్న విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్‌కు ఆయన గుర్తు చేశాడు. తాను బతికున్నంత వరకు కూడా ఈ నేల కోసమే పోరాడతానని చెప్పాడు. తాను పబ్‌లో ఎలాంటి తప్పు చేయలేదు.. ఒకవేళ తన వైపు నుంచి ఎలాంటి తప్పు ఉందని తేలినా కఠిన చర్యలకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. నేనో.. ఓ సామాన్యుడో ఎలాంటి తప్పు చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు చిక్కుకోవాలి.. ఎందుకు ఎదుర్కోవాలి సార్..? అని ఒకింత ఆవేదన వ్యక్తం చేశాడు.

అమ్మతోడు ఎవర్నీ వదలను!

నన్ను కొట్టిన వాళ్లకు పొలిటికల్ సపోర్ట్ ఉందని నన్ను టార్గెట్ చేసి కొట్టారు. నేను ఎవ్వరి జోలికీ వెళ్లలేదు. నేను ఒక్కడినే ఉన్నానని నన్ను టార్గెట్ చేసారు. తప్పు నాదైతే కచ్చితంగా పడతాను కానీ.. నాది కానప్పుడు నన్ను గెలికితే నేను ఎందుకు ఊరుకుంటా. మీ చిచ్చాకి న్యాయం జరగాలిరా. అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ గొడవ జరిగినప్పుడు నాతో పాటు ఐదుగురే ఉన్నారు. ఇంకో ముగ్గురు గానీ ఉండుంటే మజా ఉండేది. ప్రత్యర్థులు మాత్రం ఎనిమిది మంది ఉన్నారు. బ్యాగ్రౌండ్ ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి అంతే.. ఎక్కడపడితే అక్కడ చూపిస్తే బాగోదు. వాడు ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే.. అమ్మతోడు నేను ఎవ్వరినీ వదలను. నాకు న్యాయం జరగాల్సిందే. ఈ వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో చూద్దాం’ అని రాహుల్ సిప్లిగంజ్ వీడియోలో చెప్పుకొచ్చాడు. మరి ఈ బిగ్‌బాస్ విన్నర్‌కు ఏ మాత్రం న్యాయం జరుగుతుందో తెలియాలంటే ఒకట్రెండు రోజులు వేచి చూడాల్సిందే.

Rahul sipligunj Strong warning.. Full Details Here..:

Rahul sipligunj Strong warning.. Full Details Here..  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs