Advertisement
Google Ads BL

సౌత్‌లో కింగ్ సూపర్ స్టార్ మహేశ్ బాబే..!


అవును మీరు వింటున్నది నిజమే. సూపర్ స్టార్ మహేశ్ బాబే సౌత్ సింగ్..! అదేంటి ఆయనకు మించినోళ్లు సౌత్‌లో చాలా మందే ఉన్నారుగా.. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇలా చాలా మందే ఉన్నారు.. అదేం కాదండోయ్ హీరోయిజంలో కింగ్ కాదండోయ్.. ఆ లెక్కలు వేరున్నాయ్.. ఇంతకీ ఆ లెక్కలేంటి..? మహేశ్ బాబు ఏ విధంగా కింగ్ అయ్యాడు..? అనేది ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

Advertisement
CJ Advs

పిచ్చ ఫాలోయింగ్!

తెలుగు సినిమాను ఊహించనంత ఎత్తుకు తీసుకెళ్తున్న హీరోల్లో సూపర్‌స్టార్ మహేష్ బాబుది చాలా ప్రత్యేక స్థానమని అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. ఆయన సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ షేక్ అవుతుంది. వినూత్నమైన కథలతో ఒక్క ఫ్యాన్స్‌ అనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే మహేశ్.. స్టార్ హీరోల్లో ఒకరుగా నిలిచాడు. మరీ ముఖ్యంగా ఈయనకుండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అస్సలే చెప్పనక్కర్లేదు. ఈ అభిమానులో లేడీ ఫాలోయింగ్ మరీ విపరీతంగా ఉంటుంది. అభిమానులు తనను ఎంతగా అభిమానిస్తారో.. మహేశ్ కూడా అంతే అభిమానం వారిపట్ల చూపిస్తుంటారు. అలా అభిమానులే ఆయన్ను సూపర్‌స్టార్‌ స్థాయికి చేర్చారు.

కింగ్ మహేశే..!

ఇక అసలు విషయానికొస్తే.. ఇప్పుడు సౌత్‌లో కింగ్ మహేశ్.. ఎలాగంటే.. ప్రకటనల పరంగా ఇప్పటివరకూ సౌత్‌లో ఎవరూ చేయనన్ని చేసేశాడు. ఒకట్రెండు కాదండోయ్ ఏకంగా ఇప్పటి వరకూ 22 ప్రకటనలు చేసేశాడు. సౌత్‌లో ఈ రేంజ్‌‌లో ప్రకటనలు చేసిన హీరోలు ఎవరూ లేరు. సో.. సౌత్‌లో కింగ్ మహేశ్ బాబే అన్న మాట. అంతేకాదు.. ఏ వాణిజ్య సంస్థ అయినా.. పెద్ద పెద్ద బ్రాండ్‌ కంపెనీలు అయినా సౌత్ వరకూ మహేశ్‌ను సంప్రదిస్తున్నారు. ఒకవేళ మహేశ్ నో అంటే తర్వాత ఎవర్ని తీసుకోవాలా అని సదరు కంపెనీలు ఆలోచిస్తున్నాయ్. 

మహేశ్ చేసిన ప్రకటనలు ఇవీ..

కాగా.. మహేశ్ బాబు ఇప్పటి వరకూ థమ్సప్, ప్యారాగాన్, రెయిన్‌బో హాస్పిటల్స్, అభి బస్, ది చెన్నై సిల్క్స్, సంతూర్, శ్రీ సూర్య డెవలపర్స్, రాయల్ స్టాగ్, సౌతిండియా షాపింగ్ మాల్, ఇంటెక్స్ ఆక్వా, క్లోజప్, మహేంద్ర ట్రాక్టర్స్, టాటా స్కై, అమృతాంజన్ బామ్, వివెల్ ఆల్ట్రా ప్రో, యూనివర్శల్ మొబైల్ షో రూమ్, జాస్ అలుక్కాస్, టీవీఎస్ ఫోనిక్స్, హిమామీ నవరత్న, గోల్డ్ విన్నర్ ఆయిల్, ప్రోవోగ్, ఐడియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు.

Mahesh Babu King In South India.. Details Here..!:

Mahesh Babu King In South India.. Details Here..!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs