Advertisement
Google Ads BL

గ్లామరే కొంపముంచిందని గ్రహించింది


దక్షిణాదికి తారాజువ్వలా దూసుకొచ్చి... చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న రకుల్ ప్రీత్ ప్రస్తుతం సౌత్ సినిమాలు లేక అల్లాడుతోంది. టాలీవుడ్ లో అయితే స్టార్ హీరోలందరిని చుట్టేసి.. క్షణం ఖాళీ లేని జీవితాన్ని గడిపిన రకుల్ ప్రస్తుతం ఫుల్ ఖాళీగానే ఉంటుంది. బాలీవుడ్ లో ఒకటి అరా సినిమాల్తో సరిపెట్టుకుంటున్న రకుల్ ప్రీత్.. సౌత్‌లో కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాలో ఓ హీరోయిన్ గా నటిస్తుంది. ఆ సినిమా పూర్తవుతుంది అంటే ప్రస్తుతం పరిస్థితుల్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అయితే రకుల్ ఇంత త్వరగా ఫేడవుట్ లిస్ట్ లోకి వెళ్లిపోవడానికి గల కారణాలను వెతుక్కుంటుంది. అందులో భాగంగా కథకి, పాత్రకి ప్రాధాన్యమున్న సినిమాలను కాకుండా కేవలం గ్లామర్ చూపించే సినిమాలు ఒప్పేసుకోవడం వలనే తనకి ప్రస్తుతం అవకాశాలు లేవంటుంది.

Advertisement
CJ Advs

చాలా రోజుల తర్వాత కళ్ళు తెరిచిన రకుల్ ప్రీత్ తన గ్లామరే తన కొంప ముంచింది అంటుంది. తనకి వచ్చిన సినిమా అవకాశాలన్నీ .. గ్లామర్ పాత్రలకే ఇంపార్టెన్స్ ఉన్నాయి కాబట్టి....తానూ అందాలు ఆరోబోసా అని.. అదే గనక పాత్రకి కథకి ప్రాధాన్యమున్న సినిమాలను ఒప్పుకుంటే బావుండేదని అంటుంది. హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోయినా.. గ్లామర్ పాత్రలకి టెంప్ట్ అవ్వబట్టే తనకి ఈ గతి పట్టిందని వాపోతుంది. మరి పవన్ కళ్యాణ్ తో తప్ప టాలీవుడ్ హీరోలందరిని చుట్టేసిన రకుల్... మల్టీ స్టార్ హీరోలతో రిపీట్ అవ్వకుండానే జెండా పీకేసింది. మరి పాత్రకి బలముంటే.. నటనకు అవకాశముంటే.. మరికొన్నాళ్లు సినిమాల్లో కొనసాగేదాన్నిఅని.. కేవలం గ్లామర్ షో చెయ్యబట్టే తన పరిస్థితి ఇలా తయారైంది అనుకుంటుంది రకుల్.

Rakul Preet Singh talks about Present Her Situation:

No Movies to Rakul Preet Singh in south
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs