Advertisement
Google Ads BL

కాజల్ కి ఉన్న ఒక్క అవకాశం కూడా పోయే..?


లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కాజల్ చందమామ సినిమాతో విజయాన్ని అందుకుని మగధీరలో అవకాశం తెచ్చుకుని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక అప్పటి నుండి కొన్ని రోజుల పాటు తెలుగు సినిమాల్లో తిరుగులేని జయకేతనాన్ని ఎగరవేసింది. స్టార్ హీరోలందరి సరసన నటించి తాన స్టామినాని మరింత పెంచుకుంది. అయితే ప్రస్తుతం కాజల్ కి అవకాశాలు రావట్లేదని వినిపిస్తోంది.

Advertisement
CJ Advs

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగి తన గ్లామర్ తో ప్రేక్షకులకి వినోదాన్ని అందించిన కాజల్ చేతిలో ప్రస్తుతం భారతీయుడు ౨ తప్ప మిగతా సినిమాలేవీ లేవట. మొన్నటికి మొన్న తేజ దర్శకత్వంలో సీత సినిమా ద్వారా కనిపించినా కూడా ఆమెకి విజయం రాలేకపోయింది. దాంతో ఇప్పుడు కాజల్ ని హీరోయిన్ గా తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. కొత్త హీరోయిన్లు వరుసగా వస్తుండడమే గాక పాత హీరోయిన్లకి ఫాలోయింగ్ తగ్గడం వల్ల కూడా కాజల్ కి అవకాశాలు తగ్గిపోతున్నాయి.

అయితే తనని సినిమాకి పరిచయం చేసిన తేజ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న అలివేలుమంగ వెంకటరమణ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు కాజల్ స్థానంలో కీర్తి సురేష్ పేరును పరిశీలిస్తున్నారట. మహానటి సినిమాతో ఇండియా వైడ్ గా ఇమేజ్ సంపాదించుకున్న కీర్తి సురేష్ అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. దీంతో కాజల్ కి ఉన్న ఒక్క ఛాన్స్ కూడా పోయినట్టే అని తెలుస్తుంది. అయితే ఏ హీరోయిన్ కైనా ఒకదశలో ఇలాంటి పరిస్థితి రావడం సహజమేనని, అందుకు ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు.

Kajal missed her last chance:

Kajal missed her last chance 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs