జబర్దస్త్‌లో హైపర్ అది స్కిట్స్ లో కామెడీ చేసే దొరబాబు.. యూట్యూబ్ లో సెక్స్ వీడియోస్‌తో తెగ పాపులర్ అనే విషయం ఆది ప్రతి స్కిట్‌లోను దొరబాబు మీద పంచ్ వెయ్యకుండా మానడు. హాట్ రొమాన్స్ వీడియోస్‌తో బాగా పాపులర్ అయిన దొరబాబు.. నిన్న విశాఖలో జరిగిన సెక్స్ రాకెట్ రైడ్‌లో పట్టుబడి జాలుకెళ్లాడనే వార్త దుమారం రేపింది. కమెడియన్‌గా జబర్దస్త్ లో దూసుకుపోతున్న దొరబాబుతో పాటుగా మరో నటుడు పరదేశి కూడా నిన్న విశాఖలో సెక్స్ రాకెట్‌లో అడ్డంగా దొరికిపోయాడు. దొరబాబు, పరదేశిలు విటుల ప్లేస్‌లో పోలీస్‌లకు పట్టుబడ్డారు. జబర్దస్ట్‌తో పేరు తెచ్చుకున్న దొరబాబు, పరదేశిలను చూడగానే చాలామంది చిరాకు పడడమే కాదు.. బండబూతులు తిడుతున్నారు.
అయితే ఇప్పుడు దొరబాబు అరెస్ట్ అవడంతో.. దొరబాబులా ఉండే మరో నటుడు వెలుగులోకొచ్చి.. నేను కాదు బాబోయ్ ఆ దొరబాబే అరెస్ట్ అయ్యాడంటూ నెత్తినోరు బాదుకుంటున్నాడు. దొరబాబు పోలికలతో ఉండే దావుద్ అనే నటుడు దొరబాబుతో కలిసి కవల సోదరులుగా హైపర్ ఆది స్కిట్‌లో నటించాడు. అంతే కాకుండా దావుద్ అనేక సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా పనిచేశాడు. చూడడానికి అచ్చం దొరబాబులా ఉండే దావుద్.. ఇపుడు దొరబాబు అరెస్ట్ వలన కష్టాల్లో పడ్డాడు. దొరబాబు అరెస్ట్ అవడంతో చాలామంది దావుద్‌కి ఫోన్స్ చేసి బండబూతులు తిడుతున్నారట. దానితో దావుద్ మీడియా ముందుకు వచ్చి... నేను కాదు అరెస్ట్ అయ్యింది.. జబర్దస్త్ దొరబాబు అంటూ నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు.
చూడడానికి ఒకేలా ఉండడంతో అందరూ తానే అరెస్ట్ అయ్యా అనుకున్నారని, దొరబాబు విషయంలో ఏం జరుగుతుందో అని అందరిలా తానూ ఎదురు చూస్తున్నా అని, మేమిద్దరం ఒకేలా ఉంటాం కాబట్టి.. త్వరగా ఫ్రెండ్స్ అయ్యాము, దొరబాబు విషయంలో ఇలా జరగడం బాధాకరమంటూ.. దొరబాబుకి మంచే జరగాలని కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు తెలిపాడు.