Advertisement
Google Ads BL

వకీల్‌సాబ్.. దిల్ రాజు ఇలా చేశాడేంటి?


దిల్ రాజు ఈమధ్యన సినిమా ప్రమోషన్స్ విషయంలో ఆచి తూచి లెక్కలు కడుతున్నాడు. ఒకప్పుడు దిల్ రాజు సినిమా అంటే విపరీతమైన హైప్ ఉండేది. కానీ గత కొన్ని సినిమాల నుండి దిల్ రాజు బ్యానర్ నుండి సినిమా అంటే హా ఉందిలే అన్నట్టుగా ప్రేక్షకుల ఫీలింగ్ ఉంది. అందులోను దిల్ రాజు చిన్న చిన్న బడ్జెట్ కథలను ఎంచుకోవడం.. వాటికీ పెద్దగా ప్రమోషన్స్ చెయ్యకుండా బడ్జెట్ లో మిగుల్చుకోవడం చేస్తున్నాడు కాబట్టే.. ఆ సినిమా ఫలితాలు అలా తగలడుతున్నాయ్ అంటున్నారు. ఏదో జాను జాను అన్నాడు.... అది కాస్తా 10 నుండి 15 కోట్లకు దెబ్బేసింది. తాజాగా పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ అంతే ఉంది. పవన్ తో సినిమా చేస్తున్నా.. పవన్ కి 50 కోట్ల పారితోషకం ఇస్తున్నా.. పవన్ కోసం ఫ్లైట్ ఎరేంజ్ చేశా అంటూ చెప్పడం మాత్రం బాగా చెప్పాడు కానీ.. సినిమా ప్రమోషన్స్ విషయానికొచ్చేసరికి హ ఏముందిలే పవన్ క్రేజ్ ఉందిగా అది చాలు మళ్ళి ప్రమోషన్స్ కి డబ్బు దండగ అన్నట్టుగా ఉంది దిల్ రాజు వ్యవహారం..

Advertisement
CJ Advs

పవన్ పింక్ రీమేక్ టైటిల్‌తో పాటుగా పవన్ లుక్‌ని హంగామా లేకుండా రివీల్ చేసిన దిల్ రాజు మళ్ళి కామ్ గా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయాడు. రెండు రోజుల క్రితం పవన్ పింక్ రీమేక్ లుక్ అంటూ పోస్ట్ పెట్టడం.. సోమవారం సాయంత్రం పవన్ పింక్ రీమేక్ టైటిల్ వకీల్ సాబ్ అంటూ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లుక్ ని సోషల్ మీడియాలో వదిలాడు దిల్ రాజు. అబ్బో పవన్ క్రేజ్ తో అది క్షణాల్లో వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన.. ఫ్యాన్స్ డీపీల్లో ఎక్కడ చూసిన పవన్ వకీల్ సాబ్ కనబడుతున్నాడు. హమ్మయ్య కావాల్సిన క్రేజ్ వచ్చింది అనుకున్నాడు దిల్ రాజు. కానీ వకీల్ సాబ్ పై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి.

పవన్ కళ్యాణ్ లుక్ మాత్రమే వదిలారు. పింక్ సినిమా ఫస్ట్ లుక్ లో అమితాబ్ తో పాటుగా హీరోయిన్స్ తాప్సి మరియు ఇంకా ఇద్దరు అమ్మాయిల లుక్ ని డీసెంట్ గా వదిలారు. ఇక తమిళ పింక్ రీమేక్ లోను అజిత్ తో పాటుగా ముగ్గురు హీరోయిన్స్ లుక్ వదిలారు. కానీ తెలుగులో పవన్ లుక్ తో సరిపెట్టారు. అంటే ఇక్కడ హీరోయిన్స్ డమ్మిలా అంటూ విమర్శలు మొదలయ్యాయి. పవన్ కి క్రేజ్ ఉంటే ఉండొచ్చు.. కానీ పింక్ సినిమాలో హీరోయిన్స్, అమితాబ్ కనిపించరు, కేవలం పాత్రలే కనబడతాయి. అలాంటిది తెలుగు రీమేక్ లో పవన్ హీరోయిజం మాత్రమే చూపిస్తారా.. అలా అయితే పింక్ రీమేక్ వకీల్ సాబ్ గట్టెక్కడం కష్టమే అంటున్నారు.

Comments on Pawan Kalyan vakeel saab 1st look:

Dil Raju neglected Movie Promotions
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs