Advertisement
Google Ads BL

సుకుమార్ రాసిన ఆ 18 పేజీల్లో ఏముంది..?


ఆర్య సినిమాతో తెలుగు తెరకి ఒక కొత్త ప్రేమ కథని పరిచయం చేసిన దర్శకుడు సుకుమార్. ఆ సినిమాలో ఫీల్ మై లవ్ అంటూ బన్నీ చెప్పే మాటలు యూత్ లో యమా క్రేజ్ గా వెళ్ళిపోయాయి. నువ్వు నన్ను ప్రేమించనక్కరలేదు కానీ నేను నిన్నే ప్రేమిస్తా అంటూ ప్రేమలో ఇవ్వడమే తప్ప తీసుకోవడం ఉండదని చెప్పిన కథే ఆర్య. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ప్రేమ కథలని ఇలా కూడా తీయవచ్చా అని అందరూ షాక్ అయ్యేలా చేసిందీ చిత్రం.

Advertisement
CJ Advs

అప్పటి నుండి సుకుమార్ నుండి వచ్చే సినిమాలకి జనాల్లో ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ముఖ్యంగా సుకుమార్ ప్రేమ కథలకి జనాలు బాగా కనెక్ట్ అవుతారు. 100% లవ్ అయితేనేమి, కుమారి 21 ఎఫ్ అయితేనేమి ఒక్కోటి దేనికదే ప్రత్యేకంగా నిలుస్తుంది. అయితే ప్రస్తుతం బన్నీతో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా చేస్తున్న సుకుమార్ మరో ప్రేమ కథని తెర మీద తీసుకురాబోతున్నాడు.

సుకుమార్ రైటింగ్స్ , గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో యంగ్ హీరో నిఖిల్ హీరోగా కుమారి 21 ఎఫ్ దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో 18 పేజెస్ అనే సినిమా తెరకెక్కుతోంది. సుకుమార్ రాసిన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈరోజే ప్రారంభమైంది. సుకుమార్ 18 పేజీల ప్రేమకథ రాసాడా లేక ప్రేమ కథలో ఆ పద్దెనిమిది పేజీల్లో ఏముందో చూపిస్తున్నాడా అనేది సస్పెన్స్ గా ఉంది. ఒక్క విషయం మాత్రం నిజం సినిమాలో హీరోగా చేస్తున్న నిఖిల్‌కి గుర్తుండిపోయేలా ఈ సినిమా ఉంటుందని మాత్రం చెప్పగలం.

 

 

sukumar wrote 18 pages love story:

Nikhil new movie launched today which is story written by Director Sukumar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs