బిగ్ బాస్ బాస్ సీజన్ 3 విజేతగా బయటికికొచ్చిన రాహుల్ సిప్లిగంజ్.. రాగానే కెరీర్ లో బాగా బిజీ అయ్యాడు. బిగ్ బాస్ విన్నర్ కావడం రాహుల్ కి బాగా కలిసొచ్చింది. సొంత ఇల్లు, కొత్త కారుతో మూడు పూలు ఆరు కాయలతో రాహుల్ లైఫ్ టర్న్ తిరిగింది. అలాగే తెలుగు, తమిళ సినిమాల సాంగ్స్ తో పాటుగా రాహుల్ నటుడి అవతారం ఎత్తడంతో ఊపిరిసలపనంతా బిజీ అవడమే కాదు.. రోజూ ఫ్రెండ్స్ తో పార్టీలు, పబ్బులు అంటూ హడావిడి చెయ్యడం రాహుల్ సిప్లిగంజ్ నిత్యకృత్యం అయ్యింది. ఫ్రెండ్స్ తో మిడ్ నైట్ పార్టీస్ అంటూ తిరుగుతున్న రాహుల్ సిప్లిగంజ్ పై ఇపుడు ఓ రాజకీయనాయుడు కొడుకు దాడి చెయ్యడం సంచలనం అయ్యింది.
రాహుల్ సిప్లిగంజ్ గత రాత్రి పబ్ లో తన ఫ్రెండ్స్ తో పార్టీకి హాజరవగా.. తనతో పాటు వచ్చిన ఓ అమ్మాయిని కొంతమంది యువకులు కామెంట్ చెయ్యగా.. దానికి రాహుల్ ఏమిటిది అని ప్రశ్నించగా ఆ యువకులు మధ్యం మత్తులో రాహుల్ సిప్లిగంజ్ పై బీర్ బాటిల్ తో దాడి చెయ్యగా.. రాహుల్ కి తలకి గాయమైనట్లుగా తెలుస్తుంది. రాహుల్ తో గొడవపడిన యువకుల్లో వికారాబాద్ ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడని, అలాగే మరో ఎమ్మెల్యేకి కావాల్సిన కొంతమంది రాహుల్ పై దాడి చేసినట్లుగా చెబుతున్నారు. అయితే తలకు గాయమైన రాహుల్ హాస్పిటల్ కి వెళ్లి చికిత్స తీసుకుని ఇంటికి వెళ్లిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే రాహుల్ ఈ గొడవపై ఎలాంటి పోలీస్ కేసు పెట్టకపోయినా.. పోలీస్ లు మాత్రం ఈకేసుని సుమోటాగా స్వీకరించి దర్యాప్తు చేపట్టినట్లుగా సమాచారం.