Advertisement
Google Ads BL

కొరటాల కథ : చిరు, డార్లింగ్, చెర్రీ.. ఎవరికి!?


మెగాస్టార్ చిరంజీవి- సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబో సినిమా షూటింగ్ సుమారు సగం పూర్తి కావొచ్చింది. ఇచ్చిన మాట ప్రకారమే షూటింగ్ పూర్తి చేసి.. చిరు పుట్టిన రోజున మెగా ఫ్యాన్స్‌కు కానుక ఇవ్వడానికి కొరటాల విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం యంగ్ మెగాస్టార్ పాత్రకు ఎవర్ని తీసుకోవాలనే దానిపై ఇంకా కన్ఫూజన్ కొనసాగుతోంది. అది కాస్త క్లారిటీ వచ్చేస్తే సినిమా షూటింగ్ అయిపోతుందట. అయితే చిరుతో సినిమా తర్వాత వాట్ నెక్స్ట్ కొరటాల అని కొందరు లైన్‌లోకి వచ్చి అడుగుతున్నారట. 

Advertisement
CJ Advs

వాస్తవానికి ‘భరత్ అనే నేను’ తర్వాత రెండు కథలను సిద్ధం చేసుకున్న కొరటాల.. ఒకటి చిరుకు అనుకున్నాడు.. ప్రస్తుతం రన్నింగ్‌లో ఉంది. ఇంకొకటి అలానే ఉండిపోయింది. ఆ కథ ఎవరికోసమనేది ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే మళ్లీ చిరంజీవితోనే సినిమా ఉంటుందని కొందరు అంటుండగా.. లేదు లేదు.. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌‌తో ఉంటుందని పుకార్లు వినిపిస్తున్నాయి. సామాజిక అంశాలను తెరెక్కించడంలో ముందు వరుసలో ఉండే కొరటాల.. తన తదుపరి కథ కూడా అలానే ఉంటుందట. అందుకే చిరు లేదా ప్రభాస్ ఎవరికైనా సరిగ్గానే సెట్ అవుతుందట. ఇంకొన్ని సార్లు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ పేరు కొరటాల మదిలో మెదులుతోందట.

గతంలో ప్రభాస్‌- కొరటాల కాంబోలో వచ్చిన ‘మిర్చి’ ఘాటు ఇప్పటికీ తగ్గలేదు. దీంతో ఈ ఘాటు తగ్గేలోపు ప్రభాస్‌తోనే తీస్తే బాగుంటుందని సన్నిహితులు కొందరు కొరాటాలకు సలహాలు ఇచ్చారట. ప్రస్తుతం ‘జాన్’ (వర్కింగ్ టైటిల్) సినిమాతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు.. నెక్స్ట్ నాగ్ అశ్విన్‌తో భారీ బడ్జెట్ సినిమా ఉంది. ఆ సినిమా కూడా ఈ ఏడాదిలోపు షూటింగ్ పూర్తి చేసుకుని.. వచ్చే ఏడాదికి విడుదల కానుంది. ఈ గ్యాప్‌లో.. చిరుతో సినిమా పూర్తి చేసి.. కథకు ఇంకాస్త మెరుగులు దిద్దుకోవచ్చని కొరటాల అనుకుంటున్నాడట. ఫైనల్‌గా ఈ కథ చిరుకే వస్తుందా..? ప్రభాస్‌కు వస్తుందా..? వీరిద్దరూ కాకుండా రామ్ చరణ్‌ వద్దకు వెళ్తుందా..? అనేది కొరటాలే చెప్పాలి మరి.

Koratala Shiva Story Whom Purpose!:

Koratala Shiva Story Whom Purpose!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs