‘మహర్షి’ మూవీతో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు మంచి హిట్టిచ్చిన వంశీ పైడిపల్లితో.. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో..? అసలు ఈ కాంబోలో మళ్లీ సినిమా ఉందో లేదో తెలియట్లేదు కానీ.. వార్తలు, పుకార్లు మాత్రం గట్టిగానే వస్తున్నాయ్. అంతేకాదు.. ఈ వార్తలతో ఇద్దరి మధ్య మనస్పర్థలు కూడా వచ్చాయని కొన్ని రోజులు.. ‘మహేశ్-వంశీ రిలేషన్ బాగానే ఉంది!’ అని మరికొన్ని రోజులు వార్తలు వినిపించాయ్. అయితే తాజాగా అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది..? లైన్ మార్చుకుని వచ్చిన వంశీ కథకు మహేశ్ ఏమన్నాడు..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
వాస్తవానికి ఎప్పుడో ఈ కాంబోలో మూవీ సెట్స్‌పైకి వెళ్లాల్సింది కానీ.. మహేశ్‌కు స్క్రిప్ట్ నచ్చలేదని అందుకే ఈ గ్యాప్‌లో ‘గీత గోవిందం’ డైరెక్టర్ పరశురామ్‌తో చేయాలని నిర్ణయించుకున్నాడట. అయితే మహేశ్ నిర్ణయంతో బాగా హర్ట్ అయిన వంశీ.. డీప్‌లోకి వెళ్లి రెండు మూడ్రోజులు ఇంటికి దూరంగా ఉండి మరీ మార్పులు, చేర్పులు చేశాడట. అన్నీ రెడీ అయ్యాక.. మహేశ్ సతీమణి అనుమతి తీసుకుని మరోసారి రంగంలోకి దిగాడట. ఇక ఇదే ఫైనల్ సార్.. ఈ ఒక్కసారి విని మీ అభిప్రాయమేంటో తేల్చేయండి అని మొహమాటం లేకుండా వంశీ అడిగేశాడట.
మహేశ్‌ను కూర్చొబెట్టి తాజాగా మరో లైన్ వినిపించాడట. ‘సూపర్బ్ వంశీ.. ఇదేదో ముందే చేయొచ్చు కదా’ అని మహేశ్ అన్నాడట. అయితే అన్నీ సిద్ధం చేస్కోండి.. రంగంలోకి దిగేద్దాం అని మాత్రం మహేశ్ చెప్పలేదట. దీంతో పరుశురామ్ కంటే ముందే వంశీతో సినిమా ఉంటుందా..? లేకుంటే ముందే ఉంటుందా..? అనేది వంశీకి క్లారిటీ రాలేదట. అయితే వంశీ మాత్రం సెట్స్‌కు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడట. మొత్తానికి చూస్తే ఆలస్యమైనా పట్టువీడని విక్రమార్కుడిలా.. మహేశ్‌ను వంశీ ఒప్పించాడన్న మాట.. ఇక మిగిలింది షూటింగే.. ఎప్పుట్నుంచి షురూ అవుతుందో ఏంటో మరి.