టైటిల్ చూడగానే.. ఇదేంటి తెలుగులో ఎవరూ లేనట్లుగా ఏఆర్ రెహ్మాన్ పట్టుకొస్తున్నారా..? అబ్బో.. నేచురల్ స్టార్ నాని హడావుడి మామూలుగా లేదుగా..? అని కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది అక్షరాలా నిజమేనట. విభిన్న కథలతో సినిమాలు చేసే నేచురల్ స్టార్ 27వ సినిమా టైటిల్‌కు ‘శ్యామ్ సింగ రాయ్’ అనే టైటిట్‌ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించబోతుండగా.. సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.
‘హిట్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి మంచి కలెక్షన్ల మీదున్న (నిర్మాతగా) నాని తాజా చిత్రం ‘వి’ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో తన తదుపరి సినిమాపై దృష్టి సారించాడు. ఈ సినిమాకు మ్యూజిక్ ప్రాణంగా నిలవనుందట. మొత్తం అంతా బ్యా గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్‌తోనే నడస్తుందట. అందుకే స్ట్రాంగ్, మంచి మ్యూజిక్ డైరెక్టర్‌ను ఎంచుకోవాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. బడ్జెట్ కూడా భారీగా పెడుతుండటంతో ఏకంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌నే రంగంలోకి దింపేద్దాం అని భావించారట. ఆయన అయితే అన్నీ కలిసొస్తాయని.. రెహ్మాన్ తప్ప మరెవ్వరూ సినిమాకు న్యాయం చెయ్యలేరని దర్శకుడు భావిస్తున్నాడట.
ఈ క్రమంలో ఆయన్ను సంప్రదించే పనిలో నిమగ్నమయ్యారట. వాస్తవానికి ఏఆర్ తెలుగులో పనిచేసిన సినిమాలు చాలా తక్కువే.. అయినప్పటికీ ఉన్నంతలో అదరగొట్టేశాడు.. ఎవర్ గ్రీన్ అంతే. అంతేకాదు.. మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’ వంటి భారీ ప్రాజెక్ట్‌నే వద్దనుకుని ఆయన తప్పుకున్నాడు. చిరునే వద్దనుకున్న రెహ్మాన్.. నానీ సినిమా అంటే.. ఒప్పుకుని రంగంలోకి దిగుతాడా..? అనేది ప్రశ్నార్థకంగానే మారింది. అయితే.. రెహ్మాన్ ఎంత డిమాండ్ చేసినా ఫర్లేదు.. నానికోసం పట్టుకురావాలంతే.. అని దర్శకనిర్మాతలు మాత్రం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడక తప్పదు.