Advertisement
Google Ads BL

‘వకీల్ సాబ్’లో పవన్ కాదు.. ఆమే హైలైట్ అట!


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘పింక్’ రీమేక్ సినిమాతో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇన్నిరోజులుగా పవన్ లుక్ కోసం వేచి చూసిన మెగాభిమానులు, జనసేన కార్యకర్తలకు ఇటీవలే సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు శుభవార్త చెప్పాడు. తిరుమల వెంకన్న సన్నిధిలో చెప్పినట్లుగానే మార్చి 2న ఫస్ట్ లుక్, టైటిల్‌ను నిర్మాత ప్రకటించాడు. ఈ లుక్‌లో పవన్ పడుకొని బుక్ చదువుతున్నట్లు ఉన్న ఈ పిక్ సోషల్ మీడియాను ఒక్క ఊపు ఊపేసింది. దీనిపై సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాన్ని షేర్ చేయగా.. మరికొందరైతే ఏకంగా రివ్యూనే రాసుకొచ్చారు. 

Advertisement
CJ Advs

ఇక అసలు విషయానికొస్తే.. సినిమా ఎలా ఉంటుంది..? రీమేక్ గనుక సేమ్ టూ సేమ్ దింపేస్తారా..? లేకుంటే మార్పులు చేర్పులు ఏమైనా చేశారా..? అసలు సినిమాలో ఎవరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయ్..? సినిమాలో పవన్‌ కల్యాణ్ హైలైట్‌గా నిలుస్తాడా..? లేకుంటే మరొకరెవరైనా..? అనే విషయాలపై పవన్ భక్తులు, టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగు చూసింది.

అదేమిటంటే.. ఈ చిత్రంలో నివేదా థామస్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తోందట. ఆమె పాత్రే మూవీకి హైలైట్‌గా నిలుస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. వాస్తవానికి ఈ సినిమాకు తాప్సీనే తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావించినప్పటికీ అబ్బే ఆల్రెడీ ఆమెను ఒరిజనల్‌లో చూశారుగా మళ్లీ మళ్లీ అంటే వర్కవుట్ అవుతుందో కాదో అని.. తీసుకోలేదట. అయితే ఇక ఎవర్ని తీసుకోవాలా..? అని ఆలోచిస్తున్న టైమ్‌లో నివేదా గుర్తొచ్చిందట. ఎమోషన్‌తో సాగే పాత్రలో ఇదివరకే ‘నిన్ను కోరి’ నటించి మెప్పించడంతో ఆమెను తీసుకున్నారట. నివేదా ఈ పాత్రలో జీవిస్తుందని.. ఈ రోల్‌కు పూర్తి న్యాయం చేస్తుందని చిత్రబృందం భావిస్తోందట. అంతేకాదు ఈ సినిమా తర్వాత నివేదా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుందట. వరుస అవకాశాలు కూడా నివేదా తలుపు తట్టుతాయని విశ్లేషకులు అంటున్నారు. 

అంటే.. నివేదా పాత్ర సినిమాకే హైలైట్ అవుతుందని పైన చెప్పిన దాన్ని బట్టి చెప్పొచ్చు.. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే సినిమా థియేటర్లలోకి వచ్చేంతవరకూ వేచి చూడక తప్పదు మరి. ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తుండగా.. దిల్ రాజు, శిరీష్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. దివంగత నటి శ్రీదేవి బోనీకపూర్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

These Beauty role to be a highlight in Pawan vakeel saab!:

These Beauty role to be a highlight in Pawan vakeel saab!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs