Advertisement
Google Ads BL

ఓటీటీలో వస్తుందని వెయిట్‌ చేయవద్దు: దుల్కర్


‘కనులు కనులను దోచాయంటే’ చూసిన వాళ్లందరికీ నచ్చింది - దుల్కర్ సల్మాన్ 

Advertisement
CJ Advs

దుల్కర్‌ సల్మాన్‌, రీతూ వర్మ జంటగా నటించిన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ‘కణ్ణుమ్‌ కణ్ణుమ్‌ కుళ్లయడిత్తా’. తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’గా విడుదలైంది. దేసింగ్‌ పెరియసామి దర్శకుడు. నిర్మాణ సంస్థలు వయోకామ్‌ 18 స్టూడియోస్‌, ఆంటో జోసెఫ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. తెలుగులో ‘కెఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్స్’ కమలాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డితో కలిసి డా. రవికిరణ్ విడుదల చేశారు. ఫిబ్రవరి 28న విడుదలైన ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. మౌత్ టాక్ బావుండడంతో రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. 

దుల్కర్‌ సల్మాన్‌ మాట్లాడుతూ ‘‘చూసిన వాళ్లందరికీ సినిమా నచ్చింది. ఓటీటీ, డిజిటల్‌ ఫ్లాట్‌ఫార్మ్స్‌లో చూసే సినిమా కాదు. ఇది థియేటర్లలో చూడాల్సిన సినిమా. నేను సినిమాను సింగిల్‌గా చూశా. థియేటర్లలో చూశా. ఈ సినిమాకు థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ వేరు. ఓటీటీలో వస్తుందని వెయిట్‌ చేయకండి. అనీష్‌ కురువిల్ల చాలా అందమైన విలన్‌గా చేశారు. రీతూ వర్మ అందమైన, టాలెంట్‌ ఉన్న అమ్మాయి. సినిమాలో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌ చేసింది. నా క్యారెక్టర్‌ సినిమా స్టార్టింగ్‌ నుండి ఆల్మోస్ట్‌ ఒకేలా ఉంటుంది. కానీ, ఆమె క్యారెక్టర్‌లో చాలా షేడ్స్‌ ఉన్నాయి. రీతూ సెటిల్డ్‌ పర్ఫార్మెన్స్‌ చేసింది. దర్శకుడు దేసింగ్‌ పెరియసామి హార్డ్‌ వర్క్‌కి రిజల్ట్‌ ఈ సినిమా. మాకు ఈ విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అని అన్నారు.

రీతూ వర్మ మాట్లాడుతూ ‘‘వేరే సినిమా షూటింగులో ఉండడంతో సినిమా విడుదలకు ముందు హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌కి అటెండ్‌ కాలేదు. అయితే... చాలా రోజుల తర్వాత తెలుగులో మంచి సినిమాతో రావడం సంతోషంగా ఉంది. తమిళంలో సినిమా పెద్ద హిట్‌ అని అక్కడ ప్రేక్షకులు డిక్లేర్‌ చేశారు. తెలుగులో మౌత్‌ టాక్‌తో పికప్‌ అవుతోంది. కంటెంట్‌ బావుంటే తెలుగు ప్రేక్షకులు సినిమాను హిట్‌ చేస్తారని ‘కనులు కనులను దోచాయంటే’ మరోసారి నిరూపించింది. దర్శకుడు దేసింగ్‌ పెరియసామి, సినిమాటోగ్రాఫర్‌ భాస్కరన్‌ ఈ సినిమాకు రియల్‌ హీరోలు. ఐదేళ్లు దర్శకుడు ఈ కథ, సినిమా కోసం కష్టపడ్డారు. కమర్షియల్‌ సినిమాల్లో హీరోయిన్లకు పర్ఫార్మెన్స్‌కి స్కోప్‌ ఉన్న రోల్స్‌ దొరకడం కష్టం. నాకు ఈ సినిమాలో మంచి రోల్‌ దొరికింది. దుల్కర్‌ సల్మాన్‌ గుడ్‌ కో–స్టార్‌. తనతో నటించడం మంచి ఎక్స్‌పీరియన్స్‌. రక్షణ్‌ కామెడీ టైమింగ్‌ అదుర్స్‌. నిరంజని సినిమాలో నా పార్టనర్‌గా కనిపించడమే కాదు, నాకు స్టైలిస్ట్‌గా వర్క్‌ చేసింది. తనకు థ్యాంక్స్‌. ఆడియన్స్‌ సినిమాను మరింత హిట్‌ చేస్తారని ఆశిస్తున్నా’’ అని అన్నారు.

డా. రవికిరణ్‌ మాట్లాడుతూ.. ‘‘కథ, కంటెంట్‌ నచ్చడంతో కెఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రైట్స్‌ తీసుకున్నా. అండర్‌డాగ్‌గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ ఆదరణతో కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని నిరూపించింది. శని, ఆదివారాల్లో వసూళ్లు బావున్నాయి. సోమవారం మరింత పికప్‌ అయింది. రోజు రోజుకూ వసూళ్లు పెరగడం సంతోషాన్నిస్తోంది. తమిళంలో ఈ సినిమా పెద్ద హిట్‌. తెలుగులో మంచి టాక్‌ రావడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు.

అనిష్‌ కురువిల్ల మాట్లాడుతూ ‘‘మల్టీజానర్‌ ఫిల్మ్‌ ఇది. మంచి రైటింగ్‌, మంచి కాస్టింగ్‌ ఉంటే సినిమా సక్సెస్‌ అవుతుందని చెప్పడానికి ఎగ్జాంపుల్‌. దర్శకుడిగా ఇటువంటి సినిమా రాయడం, తీయడం కష్టం. థియేటర్లలోకి అరుదుగా ఇటువంటి సినిమాలు వస్తాయి. ‘పెళ్లి చూపులు’, ‘భరత్‌ అనే నేను’ తర్వాత మంచి రోల్‌ చేశా. సినిమాకు వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ బావుంది’’ అని అన్నారు.

రక్షణ్‌ మాట్లాడుతూ ‘‘చాలా సంతోషంగా ఉంది. సినిమా విడుదలకు ముందు హైదరాబాద్‌లో పబ్లిసిటీకి వచ్చినప్పుడు నాకింత పేరు వస్తుందని ఊహించలేదు. తెలుగు ప్రేక్షకులు నన్ను అప్రిషియేట్‌ చేయడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిరంజని, భాస్కరన్‌ పాల్గొన్నారు.

 

ఇతర తారాగణం:

రక్షణ్, నిరంజని అహతియాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు

సాంకేతిక విభాగం:

డైరెక్టర్: దేసింగ్ పెరియసామి

ప్రొడ్యూసర్: వయాకామ్18 స్టూడియోస్ & ఆంటో జోసెఫ్ ఫిలిం కంపెనీ

సినిమాటోగ్రాఫర్ . కె.ఎం. భాస్కరన్

మ్యూజిక్: మసాలా కాఫీ

బ్యాక్ గ్రౌండ్ స్కోర్: హర్షవర్ధన్ రామేశ్వర్

ఎడిటర్ : ప్రవీణ్ ఆంటోనీ

ఆర్ట్ : ఆర్.కె. ఉమాశంకర్

కాస్ట్యూమ్ డిజైనర్: నిరంజని అహతియాన్

స్టంట్: సుప్రీమ్ సుందర్

స్టిల్స్: ఎం.ఎస్. ఆనంద్

కోరియోగ్రఫీ: ఎం. షెరీఫ్

పీఆర్వో: నాయుడు సురేంద్రకుమార్ - ఫణి కందుకూరి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నిరూప్ పింటో

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: మోహన్ గణేశన్

ప్రొడక్షన్ కంట్రోలర్: ఎస్. వినోద్ కుమార్

Kanulu Kanulanu Dochayante Succes Meet Highlights:

Celebrities speech at Kanulu Kanulanu Dochayante Succes Meet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs