శర్వానంద్ ప్రస్తుతం తన కెరీర్లో విపరీతమైన ఒడిదొడుకులకి గురవుతున్నాడు. వరుస ఫ్లాపులతో తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు. కెరీర్ పరంగా శర్వా తీవ్ర నిరుత్సాహంగా ఉన్న ఫేజ్ లాగా కనిపిస్తుంది. పడి పడి లేచే మనసు, రణరంగం, జాను ఇల వరుస పెట్టి ఫ్లాపులు వస్తుంటే శర్వా మార్కెట్ రోజు రోజుకీ కిందపడుతూ వస్తుంది. తమిళంలో సూపర్ హిట్ సాధించిన 96 సినిమా రీమేక్ లో సమంత సరసన నటించినా కూడా విజయం దక్కలేదు. ప్రస్తుతం శర్వానంద్ శ్రీకారం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడట.
అయితే శర్వా కొన్ని ఫ్లాపులని తెలిసి మరీ తెచ్చుకున్నాడట. దర్శకులు, నిర్మాతలతో ఉన్న స్నేహం కారణంగా తన వద్దకి వచ్చిన కథల్లో అంతగా కొత్తదనం లేకపోయినా వారి కోసం ఒప్పుకున్నాడట. అలా మొహమాటం వల్ల ఒప్పుకున్న సినిమాల వల్లనే తాను ఫ్లాపులు ఎదుర్కొన్నానని, ఇక నుండి సినిమాలు ఒప్పుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని, కథల విషయంలో అవతలి వారి సలహా కోసం వెయిట్ చేయనని చెప్తున్నాడు. అలాగే తన తర్వాతి సినిమాలో కామెడీ ఉండేలా చూసుకుంటాడట.
మొహమాటం పక్కన పెట్టి ఆల్రెడీ స్టార్ట్ అయిన సినిమాలనే క్యాన్సిల్ చేసే నటులున్న ఈ రోజుల్లో ఎవరో ఏదో అనుకుంటారని తనకి నచ్చని కథని చేయడం ఏంటో మరి..