Advertisement
Google Ads BL

మార్చికి నువ్వొస్తేనే నాని.. లేదంటే బోరే!


ఫిబ్రవరిలో సమంత జాను మెరిపించి కలెక్షన్స్ పరంగా డల్ అయ్యింది. మధ్యలో నితిన్ భీష్మ సినిమా ఉవ్వెత్తున లేచిన కిరణంలా హిట్ కలెక్షన్స్ కొల్లగొడుతుంది. ఫిబ్రవరి 21 న విడుదలైన భీష్మకి హిట్ టాక్ మాత్రమే కాదు.. హిట్ కలెక్షన్స్ తో బాక్సాఫీసు కళకళలాడింది. ఇక ఫిబ్రవరి చివరిలో నాని హిట్ సినిమాకి హిట్ టాక్ పడింది. నాని నిర్మాతగా తెరకెక్కిన హిట్ సినిమా హిట్ అవడంతో అన్ సీజనైనా ఫిబ్రవరి కళకళలాడింది. ఇక మార్చిలో మాత్రం ఎగ్జామ్స్ ఫీవర్ తో స్టూడెంట్స్ కనబడుతుంటే మార్చి బాక్సాఫీసు కూడా వెలవెలబోతుంది. మార్చి చివరి వారం అంటే ఉగాది వరకు సరైన సినిమాలేవీ లేవు. ఈ వారం మొదలు మరో మూడు వారాలు చిన్న చితక సినిమాలు తప్ప గట్టిగా నిలబడేసినిమాలేవీ లేవు.

Advertisement
CJ Advs

ఇక ఉగాది రోజున నాని - సుధీర్ బాబు కలయికలో బుడ్డి మల్టీస్టారర్ గా తెరకెక్కిన ‘వి’ ద సినిమా వచ్చే వరకు ప్రేక్షకులు ఉసూరుమనాల్సిందే. నాని విలన్ గా సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమాని ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ నుండే సినిమా మీద మంచి అంచనాలు ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడడం టీజర్ కూడా ఆకట్టుకునేలా ఉండడంతో వి కోసం ప్రేక్షకులు ఎదురు చూడాల్సిన పరిస్థితి. మార్చి బాక్సాఫీసు డల్ నెస్ చూసాక ప్రేక్షకులకు డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లు తప్ప థియేటర్స్ కి వెళ్లే ఆలోచనలు లేవు. మరి అందుకే అందరూ నాని నువ్వొచ్చేవరకు మాకు బోర్ అంటున్నారు. మరి నాని విలన్ పాత్రలో చేస్తున్న వి సినిమాపై అందరిలో ఆత్రం, అంచనాలు, క్యూరియాసిటీ ఉన్నాయి.

Fans Waiting for Natural Star Nani V Movie:

Nani V Movie Release on Ugadi Festival 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs