Advertisement
Google Ads BL

RRR హీరోల తర్వాత చిత్రాలపై షాకింగ్ అప్‌డేట్స్!


రామ్ చరణ్ - ఎన్టీఆర్ లు రెండేళ్లపాటు రాజమౌళి వలలో చిక్కుకుని బయటికి రాలేక గిల గిల కొట్టుకుంటున్నారని అందరూ అనుకున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే మా హీరోలను ఎప్పుడు వదులుతావయ్యా అంటూ రాజమౌళికి రిక్వెస్ట్ లు కూడా పెట్టుకున్నారనే న్యూస్ నడిచింది. అయితే RRR జనవరి 8, 2021 కి వెళ్లడంతో ఈలోపు తమ హీరోలు కేవలం RRR కోసం త్యాగం చేస్తారేమో అని భయపడిన వారికి ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా ఎనౌన్స్ చేసి అందరిని ఆశ్చర్యంలో పడేసాడు. RRR తో పాటే త్రివిక్రమ్ మూవీ కూడా ఏప్రిల్ నుండి సెట్స్ మీదకెళ్ళబోతున్నాడట ఎన్టీఆర్. మరోపక్క రామ్ చరణ్ వ్యవహారం ఎటూ తెగడం లేదు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కి ఓకే చెప్పేసాడు. కానీ చరణ్ ఇంకా ఎవరికీ ఓకే చెప్పకపోవడంతో మెగా ఫ్యాన్స్ కాస్త ఫీల్ అవుతున్నారు.

Advertisement
CJ Advs

తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ తండ్రి చిరు సినిమా తర్వాత కొరటాలతో మూవీ కన్ఫర్మ్ అంటున్నారు. చిరు - కొరటాల సినిమా పూర్తి కాగానే చరణ్ కోసం కొరటాల కథ సిద్ధం చేస్తాడని అందుకే చరణ్ కొరటాలను లైన్ లో పెట్టాడని త్రివిక్రమ్ తర్వాత ఎన్టీఆర్ కూడా కొరటాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడనే టాక్ మొదలవడమే కాదు, త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ త్రివిక్రమ్ కి ఓకే చెప్పేసాడంటున్నారు. వినడానికి కన్ఫ్యూజన్ గా ఉన్నప్పటికీ ఈ వార్తలు మాత్రం ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ కి పండగ తెచ్చేసాయి. ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు దర్శకులను ఎడా పెడా వాడేస్తారంటూ అప్పుడే సోషల్ మీడియాలో న్యూస్ లు మొదలైపోయాయి.

Shocking Updates on RRR Heroes Next Movies :

Ram Charan and jr ntr Changed their directors 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs