Advertisement
Google Ads BL

చిన్న చిత్రాలకిదే సరైన సమయం..


ఈ సంవత్సరం తెలుగు సినిమాకి గొప్ప ప్రారంభం దొరికింది. సంక్రాంతి కానుకగా రిలీజైన రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీసు దగ్గర భీభత్సం సృష్టించాయి. ఒకదానికొకటి పోటీగా నిలబడుతూ రెండూ కూడా మంచి వసూళ్ళు సాధించాయి. బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఆ రెండు చిత్రాలు ప్రారంభించిన విజయం ఫిబ్రవరిలోనూ కొనసాగింది. జాను, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలు వాటి ప్రభావాన్ని చూపలేకపోయినా చివర్లో వచ్చిన భీష్మ మంచి టాక్ ని తెచ్చుకుని హిట్ దిశగా పరుగులు పెడుతోంది.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు ఫిబ్రవరి కూడా అయిపోయింది. మార్చ్ నెలలో రిలీజ్ అవడానికి పెద్ద సినిమాలు కూడా లేవు. ఒక్క నాని సినిమా మినహాయిస్తే మిగతావన్నీ చిన్న చిత్రాలే. నాని వి కుడా మార్చ్ చివరి వారాంతంలో థియేటర్లని తాకనుంది. అప్పటి వరకు థియేటర్లలో ఆడేవన్నీ చిన్న సినిమాలే.  మార్చ్ లో రిలీజ్ అయ్యే సినిమాలు నాలుగు ఉంటే అందులో మూడు చిత్రాలు మొదటి వారంలోనే రిలీజ్ అవుతున్నాయి.

పలాస, ఓ పిట్ట కథ, అనుకున్నదొకటి అయినదొకటి వంటి చిత్రాలు మార్చ్ ౬వ తేదీన విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. మార్చ్ 6 తర్వాత 25 వరకు సినిమాలే లేకపోవడం గమనార్హం. ఆ టైమ్ లో స్టూడెంట్స్ ఎగ్జామ్స్ బిజీలో ఉండడం వల్ల ఫ్యామిలీస్ థియేటర్లకి రారన్న ఉద్దేశ్యంతో ఆ డేట్లని ఖాళీగా వదిలేస్తున్నారు. కానీ తక్కువ బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలకి అదే కరెక్ట్ సమయని, అసలు సినిమాలు లేని టైమ్ ని వృధా చేసుకోకుండా కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని ప్రమోట్ చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని సలహా ఇస్తున్నారు.

Its right time for small budget movies:

Its right time for Smalla budget movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs