Advertisement
Google Ads BL

‘కృష్ణ మనోహర్ ఐ.పి.ఎస్’ రిలీజ్‌కు రెడీ!


మార్చి 6న విడుద‌ల కాబోతున్న ప్ర‌భుదేవా ‘కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్’

Advertisement
CJ Advs

అటు ద‌ర్శ‌కుడిగా, ఇటు కొరియోగ్రాఫర్ గా అలానే హీరోగా కూడా మ‌ల్టీటాలెంట్స్ తో దూసుకుపోతున్న ప్రభుదేవా తొలిసారిగా ఓ పోలీస్ గెటెప్ లో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు.  ప్రభుదేవా హీరోగా నటించిన పొన్ మానిక‌వ‌ల్ అనే‌ తమిళ చిత్రాన్ని తెలుగులో ‘కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్’ పేరుతో మార్చి 6న‌ విడుదల చేస్తున్నారు. ఈ మాస్ మసాలా ఎంటర్ టైనర్ ను, పవనపుత్ర ప్రొడక్షన్స్ పతాకంపై యనమల సుధాకర్ నాయుడు సమర్పణలో సీనియర్ ప్రొడ్యూసర్ ఆర్. సీతారామరాజు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్ర‌భుదేవ‌కు జోడీగా డ‌స్కీ బ్యూటీ ఫేమ్ నివేదా పేతురాజ్ న‌టిస్తోంది. ఇటీవ‌లే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీ అల వైకుంఠ‌పుర‌ములో నివేదా న‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఈ చిత్రంలో హీరో హీరోయిన్ తో పాటు బాహుబలి ప్రభాకర్, సురేష్ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. భారీ రేంజ్ లో  ఈ చిత్రాన్ని మార్చి 6న తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకువ‌స్తున్నామ‌ని, కొరియోగ్రాఫర్ గా, హీరోగా, దర్శకుడిగా పలు సంచలన విజయాలు సాధించిన ప్రభుదేవా తొలిసారి డేర్ డెవిల్ పోలీస్ ఆఫీసర్ గా సంఘ విద్రోహశక్తుల పాలిట సింహస్వప్నంగా నిలిచే పవర్ ఫుల్  పాత్రలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాడని, నిర్మాత ఆర్.సీతారామరాజు తెలిపారు.

ఈ చిత్రానికి 

మాటలు: రాజేష్ 

పాటలు: భువనచంద్ర 

సంగీతం: డి.ఇమ్మాన్ 

నిర్వహణ: ఎస్.చంద్రశేఖర్ నాయుడు 

సమర్పణ: యనమల సుధాకర్ నాయుడు 

నిర్మాత: ఆర్.సీతారామరాజు

దర్శకత్వం: ముఖిల్ చెల్లప్పన్

Krishnamanohar IPS Ready to Release:

Krishnamanohar IPS Release on March 6th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs